తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మన్కడింగ్​ను తప్పనిసరి చేయాలి'

క్రికెట్​లో మన్కడింగ్​ను తప్పనిసరి చేయాలంటూ అభిప్రాయపడ్డాడు వ్యాఖ్యాత హర్షా భోగ్లే. బ్యాట్స్​మెన్​కు లేని నిబంధనలు బౌలర్లకు ఎందుకని ప్రశ్నించాడు.

harsha bhogle, mankading
హర్ష భోగ్లే, మన్కడింగ్

By

Published : Apr 20, 2021, 2:49 PM IST

చెన్నై-రాజస్థాన్ మ్యాచ్​ సందర్భంగా దిగ్గజ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో మన్కడింగ్​ను తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో బ్యాట్స్​మన్లు కూడా నిబంధనలను పాటించాలని సూచించాడు.

వాంఖడే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్​లో తొలుత చెన్నై బ్యాటింగ్​ చేసింది. రాజస్థాన్​ బౌలర్​ ముస్తాఫిజుర్ బౌలింగ్​ చేస్తుండగా.. నాన్​ స్ట్రైకింగ్​ ఎండ్​లో చెన్నై బ్యాట్స్​మన్​ డ్వేన్​ బ్రావో ఉన్నాడు. అది నోబాల్​ కావడం వల్ల రీప్లేను పరిశీలించారు. ముస్తాఫిజుర్​ బంతి వేసేటప్పుడు బ్రావో క్రీజుకు గజం దూరంలో ఉన్నట్లు రీప్లేలో కనిపించింది.

ఇదీ చదవండి:ఒలింపిక్స్ కోసం గబ్బా స్టేడియం పునర్ నిర్మాణం

"బ్రావో ఎక్కడ ఉన్నాడో చూడండి. అతన్ని రనౌట్​ చేయాల్సింది. మన్కడింగ్​ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ గొప్ప గొప్ప మాటలు చెబుతారు. అంటే బ్యాట్స్​మన్​ మాత్రం నిబంధనలు ఉల్లంఘించవచ్చా? ఇదంతా అర్థం లేని వాదన. క్రికెట్​లో మన్కడింగ్​ను తప్పనిసరి చేయాలి."

-హర్షా భోగ్లే, క్రికెట్ వ్యాఖ్యాత.

2019 ఐపీఎల్ సందర్భంగా అప్పుడు పంజాబ్​ (ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్​లో ఆడుతున్నాడు)కు ఆడుతున్న రవిచంద్రన్​ అశ్విన్​.. జాస్ బట్లర్​ను మన్కడింగ్​ పద్ధతిలో ఔట్​ చేశాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ.. అప్పట్లో దీనిపై పెద్ద చర్చ జరిగింది. అయితే అశ్విన్​ మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఇదీ చదవండి:సంక్షోభంలో దక్షిణాఫ్రికా క్రికెట్.. కెప్టెన్ల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details