ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను (ఐపీఎల్) (IPL News) విజయవంతం చేసేందుకు బీసీసీఐ (BCCI) కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఏ మాత్రం కరోనా వైరస్‌కు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. అన్ని వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ఆటగాళ్లు ఎవరైనా సిక్సర్ బాదితే ప్రత్యామ్నాయ బంతిని ఇవ్వనుందని తాజా సమాచారం.
ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాట్స్‌మెన్ సిక్సర్లు బాదితే స్టాండ్స్‌లోకి వెళ్లిన బంతిని అంపైర్లు వెంటనే శానిటైజ్ చేస్తున్నారు. బీసీసీఐ అంతకు మించే జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఏకంగా మరో బంతిని ఇవ్వనుందని అంటున్నారు. నిజానికి బంతి వల్ల కొవిడ్ వచ్చే అవకాశాలు దాదాపుగా లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ బీసీసీఐ ఏ మాత్రం రిస్క్ తీసుకోవాలని భావించడం లేదు.