తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 14th Edition: 14 బయో బుడగలు.. 6 రోజుల క్వారంటైన్​ - ఐపీఎల్

ఐపీఎల్​ 14వ సీజన్​ రెండో దశకు సంబంధించి బయో బుడగలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది బీసీసీఐ. వీటిలో ఎనిమిది ఫ్రాంఛైజీలకు కేటాయించనున్నట్లు పేర్కొంది. వీటిలోకి ప్రవేశించడానికి ముందు ఆటగాళ్లు ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్​లో ఉడాలని స్పష్టం చేసింది.

ipl
ఐపీఎల్

By

Published : Aug 6, 2021, 10:31 PM IST

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 14వ సీజన్​ రెండో దశకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). యూఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో 14 బయో బబుళ్ల​ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. వీటిలోకి ప్రవేశించే ముందు ఆరు రోజుల పాటు ఆటగాళ్లందరూ క్వారంటైన్​లో ఉండాలని స్పష్టం చేసింది. దీంతో పాటు లీగ్​ సజావుగా సాగడానికి ఆటగాళ్లతో పాటు ఆయా ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పాటించాల్సిన ఆరోగ్య సూచనలను వెల్లడించింది. ఇందుకు సంబంధించి 46 పేజీలతో కూడి సలహా(అడ్వైజరీ) బుక్​ను విడుదల చేసింది.

"బయో సెక్యూర్​ వాతవరణంలో మొత్తం 14 బయో బుడగలను ఏర్పాటు చేశాం. ఇందులో ఫ్రాంఛైజీ జట్లు, సపోర్ట్​ స్టాఫ్​కు 8 బయో బబుల్స్​ను కేటాయించనున్నాం. మూడింటిని మ్యాచ్​ అఫిషియల్స్​, మేనేజ్​మెంట్​ టీమ్​కు ఇవ్వనున్నాం. మిగిలిన వాటిలో బ్రాడ్​కాస్ట్​ కామెంటేటర్స్​ ఉండటానికి ఏర్పాట్లు చేశాం" అని బీసీసీఐ తెలిపింది.

అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లు.. వారికి కేటాయించిన హోటల్​ గదుల్లో ఆరు రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలి. వారంతా ప్రాక్టీస్​ సెషన్లకు హాజరయ్యే ముందు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చేయించుకోవాలి. వీరంతా బీసీసీఐ కేటాయించిన బస్సులు, కార్లలో మాత్రమే ప్రయాణాలు చేయాలి. సంబంధిత డ్రైవర్లు కూడా బయో బుడగలో ఉంటారు. వారికి కూడా నిరంతరం కొవిడ్ పరీక్షలు చేస్తారు.

వారికి నేరుగా..

బబుల్​​ నుంచి మరో బబుల్​లోకి వచ్చే ఆటగాళ్లకు నేరుగా అవకాశం కల్పించనుంది బీసీసీఐ. దీంతో కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​ నుంచి వచ్చే ఆటగాళ్లు నేరుగా ఐపీఎల్​ బుడగ​లో ప్రవేశిస్తారు. వీరితో పాటు ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్న ఆటగాళ్లు, శ్రీలంక-దక్షిణాఫ్రికా సిరీస్​లో ఉన్న ప్లేయర్లు సరాసరి బీసీసీఐ ఏర్పాటు చేసిన బుడగలో చేరనున్నారు.

కొవిడ్ వల్ల వాయిదా పడిన ఐపీఎల్​ రెండో దశ సెప్టెంబర్​ 19న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య జరగనుందని బీసీసీఐ వెల్లడించింది.

ఇదీ చదవండి:Eng vs Ind: భారత్​ 278 ఆలౌట్​.. అండర్సన్​ రికార్డు

ABOUT THE AUTHOR

...view details