ఐపీఎల్ 13 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. అంతకముందు సీజన్లలాగే కొంతమంది యువ ఆటగాళ్లు తమ అసాధారణమైన ప్రతిభ, అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరీ దృష్టినీ ఆకర్షించారు. దేవదత్ పడిక్కల్, రాహుల్ తివాతియా, రవి బిష్ణోయ్, టి.నటరాజన్, రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ తమ ఆటతో బాగా ఆకట్టకున్నారు. ఇక కార్తీక్ త్యాగీ, తుషార్ దీశ్పాండే, రియాన్ పరాగ్, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమాద్ కూడా తమకొచ్చిన అవకాశాలను బాగానే వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో వీరి రికార్డులను ఓసారి పరిశీలిద్దాం.
పడిక్కల్
బెంగళూరు జట్టు ఓపెనర్ దేవదత్ పడిక్కల్.. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో తన జట్టు తరఫున అత్యధిక పరుగులు(472) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో ఐదు అర్ధ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. మొత్తంగా 51 ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లు కొట్టాడు.
తెవాతియా
రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాతియా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. పంజాబ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఐదు సిక్స్‌లు బాది అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఆ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 11 ఇన్నింగ్స్‌లో 255 పరుగులతో పాటు 10 వికెట్లు తీసి అదరగొట్టాడు.
రవి బిష్ణోయ్
ఈ సీజన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆదిలోనే అదరగొట్టేశాడు. స్టార్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మాదిరిగా అదిరేటి బౌలింగ్ చేశాడు. 14 ఇన్నింగ్స్‌లో 12 వికెట్లు తీశాడు. తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్స్‌కు చుక్కలు చూపించాడు. స్టార్ ఆటగాళ్లైన వార్నర్, బెయిర్ స్టో, పంత్, ఫించ్, మోర్గాన్‌ను పెవిలియన్ చేర్చాడు.
టి.నటరాజన్