తెలంగాణ

telangana

ETV Bharat / sports

చాహల్​పై ప్రేమతో ధనశ్రీ చిందులు - chahal man of the match award

సన్​రైజర్స్​ హైదరాబాద్​-బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో చాహల్​ 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్'​ను అందుకోవడంపై హర్షం వ్యక్తం చేసింది అతడికి కాబోయే భార్య ధన శ్రీ. చాహల్ ఆ అవార్డును అందుకుంటున్న దృశ్యాన్ని టీవీలో చూస్తూ ఆనందంతో ఎగిరి గంతేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది.

Yuzvendra Chahal's Fiancee
చాహల్​ ఫియాన్సీ

By

Published : Sep 22, 2020, 9:37 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ఐపీఎల్​ మూడో మ్యాచ్​లో సన్​రైజర్స్​పై బెంగళూరు జట్టు సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించాడు యుజ్వేంద్ర చాహల్​. 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లను తీసుకోవడం ద్వారా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'ను సొంతం చేసుకున్నాడు. చాహల్​ ఈ అవార్డును అందుకుంటున్న దృశ్యాన్ని టీవీలో చూసి ఆనందంతో ఎగిరి గంతులేసింది అతడికి కాబోయే సతీమణి ధనశ్రీ. కేరింతలు కొడుతూ చిందులేసింది. ఆరు నెలల తర్వాత అతడు ఆడిన తొలి మ్యాచ్​లోనే ఈ అవార్డును అందుకోవడంపై హర్షం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది.

మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు మొగ్గుతున్న దశలో చాహల్ మాయ చేశాడు. 12వ ఓవర్​లో మనీష్ పాండే (34)ను ఔట్ చేసి.. మరుసటి ఓవర్లో బెయిర్‌స్టో (61), విజయ్ శంకర్‌లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో చివరి ఐదు ఓవర్లలో విజయానికి 43 పరుగులు చేయాల్సిన హైదరాబాద్‌ పేకమేడలా కూలిపోయింది. 32 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లను చేజార్చుకుంది. మొత్తంగా పది పరుగుల తేడాతో సన్​రైజర్స్​పై బెంగళూరు జట్టు విజయం సాధించింది.

ఇదీ చూడండి ఐపీఎల్: రస్సెల్ షాట్​కు పగిలిపోయిన కెమెరా

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details