తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కమిన్స్ ప్రదర్శన యువ బౌలర్లకు స్ఫూర్తి' - Yuvraj Singh Pat Cumminsws

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో తన ఫామ్​ను తిరిగి సాధించాడు ప్యాట్ కమిన్స్. తొలి మ్యాచ్​లో విఫలమైన ఇతడు రెండో మ్యాచ్​లో సత్తాచాటడం వల్ల పలువురు కమిన్స్​ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. టీమ్​ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా కమిన్స్​ను ప్రశంసించాడు.

Yuvraj Singh reacted to Pat Cummins superb comeback spell
కమిన్స్‌ను చూసి నేర్చుకోవాలి: యువీ

By

Published : Sep 27, 2020, 2:26 PM IST

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియన్‌ ఫాస్ట్‌ బౌలర్‌, కోల్‌కతా నైట్​రైడర్స్ ఆటగాడు కమిన్స్‌ తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో విమర్శలకూ గురయ్యాడు. అయితే శనివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్‌ కట్టుదిట్టంగా బంతులు వేశాడు. బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి వికెట్‌ తీశాడు. కీలక సమయంలో హైదరాబాద్‌ ఓపెనర్‌ బెయిర్‌స్టోను ఔట్ చేశాడు. కమిన్స్‌ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ స్పందించాడు. కమిన్స్‌ను చూసి యువబౌలర్లు ఎంతో నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.

"కమిన్స్‌ తిరిగి లయ అందుకున్న తీరు అద్భుతం. తొలి మ్యాచ్‌లో విఫలమైనా.. తర్వాతి మ్యాచ్‌లో తన నాణ్యమైన బంతులతో హైదరాబాద్‌ జట్టును ఇబ్బంది పెట్టాడు. చాలా మంది యువబౌలర్లు తొలినాళ్లలో ఇబ్బంది పడి తీవ్ర నిరాశకు గురవుతుంటారు. అలాంటి వాళ్లు బంతితో తిరిగి ఎలా రాణించవచ్చో కమిన్స్‌ను చూసి నేర్చుకోవాలి."

-యువరాజ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

కోల్‌కతా జట్టులో కమిన్స్‌కు తోడు మిగతా బౌలర్లు కూడా రాణించడం వల్ల ప్రత్యర్థి జట్టు 142 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (70) రాణించాడు. దీంతో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details