తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇషాన్ కిషన్​ అంటేనే.. వెరీ వెరీ స్పెషల్​' - ఇషాన్​ కిషన్ వార్తసు

ఐపీఎల్​ ఫైనల్లో దిల్లీని ఓడించి టైటిల్​ సొంతం చేసుకుంది ముంబయి ఇండియన్స్​. ఈ నేపథ్యంలో ముంబయి ఆటగాడు ఇషాన్​ కిషన్​ను ప్రశంసల జల్లుతో ముంచెత్తాడు మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​. అతడు చాలా ప్రత్యేకమైన ఆటగాడని పేర్కొన్నాడు.

Yuvraj said mumbai indians team player ishan kishan is a special player in making
ఇషాన్ కిషన్​ అంటేనే.. వెరీ వెరీ స్పెషల్​:యూవీ

By

Published : Nov 11, 2020, 1:38 PM IST

Updated : Nov 11, 2020, 2:11 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన ఐపీఎల్ తుదిపోరులో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది ముంబయి ఇండియన్స్​. ఆ జట్టు విజయంలో ఇషాన్​ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ​ఈ నేపథ్యంలో అతడి ఆటతీరుపై టీమ్​ ఇండియా మాజీ బ్యాట్స్​మన్​ యువరాజ్​ సింగ్​ ప్రశంసల జల్లు కురిపించాడు. ఫైనల్లో పోరాడి ఓడిన దిల్లీ జట్టునూ అభినందించాడు యూవీ.

"ముంబయి ఇండియన్స్​ జట్టుకు అభినందనలు​. ఐపీఎల్​ సీజన్​లో ఉత్తమ జట్టు మీది. ఫైనల్లో రోహిత్​ శర్మ అదరగొట్టాడు. దిల్లీ అద్భుతంగా పోరాడి, మనసుల్ని గెలుచుకుంది. పరుగుల్ని రాబట్టడంలో ఇషాన్​ కిషన్​ చాలా చాలా ప్రత్యేకమైన ఆటగాడు."

-యువరాజ్​ సింగ్​, టీమ్​ ఇండియా మాజీ క్రికెటర్​

ముంబయి ఇండియన్స్​ తరఫున పదమూడు మ్యాచ్​లు ఆడిన ఇషాన్​ కిషన్​ ఈసారి ఐపీఎల్​లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 516 పరుగులు చేయగా.. అందులో 30 సిక్సర్లు ఉన్నాయి. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానం సంపాదించాడు. దిల్లీతో మంగళవారం జరిగిన ఐపీఎల్​ తుదిపోరులో 20 బంతుల్లోనే 33 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. అంతకుముందు లీగ్​ దశలో ఆర్​సీబీతో జరిగిన పోరులో 99 పరుగులు నమోదు చేశాడు.

ఇదీ చూడండి:ఐపీఎల్​ తుదిపోరు.. రికార్డులతో హిట్​ మ్యాన్ జోరు​

Last Updated : Nov 11, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details