రాజస్థాన్‌తో మంగళవారం మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనీ, ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడమేంటని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశ్నించాడు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాలి కానీ, చివర్లో బ్యాటింగ్‌కు దిగడం సరికాదని అభిప్రాయపడ్డాడు. తర్వాతి మ్యాచ్‌ల్లోనైనా ముందుగా బ్యాటింగ్‌కు దిగి, యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలవాలని మహీకి గంభీర్ సూచించాడు.
"ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడమా? అతడి కంటే ముందు రుతురాజ్, సామ్ కరన్‌లను ఎందుకు పంపాడో నాకైతే అర్థం కాలేదు. కెప్టెన్‌గా ముందుండి నడిపించాలి. దీనిని అలా ఎవరూ అనుకోరు. 217 లాంటి భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భాగంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా అప్పటికే ఆట దాదాపు అయిపోయింది. డుప్లెసిస్ ఒక్కడే ఒంటరిగా పోరాటం చేశాడు. చివర్లో వచ్చి మూడు సిక్సర్లు కొట్టినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కెప్టెన్‌గా చాలా పొరపాట్లు చేసినా, బహుశా ప్రజలు దీని గురించి మాట్లాడరు. ఇప్పటి నుంచైనా జట్టును ముందుండి నడిపించి ఆటగాళ్లకు ధోనీ ప్రేరణగా నిలివాలి. నాలుగు, ఐదు స్థానాల్లో లేదా డుప్లెసిస్‌తో బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టాలి"