రాబోయే ఐపీఎల్ సీజన్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మహేంద్రసింగ్ ధోనినే కెప్టెన్‌గా కొనసాగిస్తే ఆశ్చర్యపడనని భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. సీఎస్కేకు కెప్టెన్సీ చేస్తున్నపుడు ధోనీ నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాడని అభిప్రాయపడ్డాడు.
"కెప్టెన్-యజమానుల మధ్య బలమైన బంధానికి చెన్నై ఉదాహరణ. వాళ్లు ఎంఎస్‌కు ఎంతో స్వేచ్ఛనిచ్చారు.. మరెంతో గౌరవించారు. కాబట్టి ఆడినంత కాలం వాళ్లు అతణ్ని జట్టు కెప్టెన్‌గా కొనసాగిస్తే ఆశ్చర్యపడను. వచ్చే సీజన్లో మహీ కొత్త జట్టుతో బరిలో దిగే అవకాశం ఉంది. చెన్నైకి అతనెంతో చేశాడు. మూడు ఐపీఎల్ ట్రోఫీలు సాధించడం వల్ల ధోనీకి చెన్నై యాజమాన్యం ఎంతో విలువ ఇస్తుంది. అతను కూడా తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడేందుకు ప్రయత్నిస్తాడు. సీఎస్‌కేకు కెప్టెన్సీ చేస్తున్నప్పుడు ధోని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాడు."