తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విలియమ్సన్​ లేకపోతే హైదరాబాద్ జట్టుకు​ కష్టమే'

విలియమ్సన్​ లేకపోవడం వల్ల హైదరాబాద్​ జట్టు బలహీనంగా ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఫిట్​గా ఉంటే ఎందుకు ఆడట్లేదని ప్రశ్నించాడు.

Kane Williamson
కేన్​ విలియమ్సన్​

By

Published : Sep 27, 2020, 5:25 PM IST

ఈ ఐపీఎల్​లో భారీ అంచనాలతో బరిలో దిగిన ఫ్రాంచైజీల్లో సన్​రైజర్స్ హైదరాబాద్​ ఒకటి. కానీ వరుస ఓటములతో అభిమానులను నిరాశపరుస్తోంది. ఆర్సీబీ, కోల్​కతా జట్లపై ఓటమిపాలైంది. ఈ క్రమంలో సన్​రైజర్స్​​ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్​, కమెంటేటర్​ ఆకాశ్​ చోప్రా. విలియమ్సన్​ లేకపోవడం వల్ల, బ్యాటింగ్​ ఆర్డర్​ బలహీనంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. అతడికి గాయాలేం కాలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు గుర్తుచేశాడు. ఫిట్​గా ఉంటే సన్​రైజర్స్​ తరఫున వెంటనే ఆడాలని సూచించాడు.

"గాయం కారణంగా మిచెల్​ మార్ష్​ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో నబీని ఆడించారు. విలియమ్సన్​ ఫిట్​గానే ఉన్నాడు. గత ఇంటర్వ్యూలో తన గాయం గురించి కూడా ఎక్కడా ప్రస్థావించలేదు. కేన్ ఆరోగ్యంగా దృఢంగా ఉంటే ఎందుకు ఆడకూడదు? జట్టు బలంగా కనిపిస్తోంది. ఎలాగైనా అతడిని తీసుకొచ్చే మార్గాలను కనుక్కోవాల్సి ఉంది. విలియమ్సన్ లేకపోతే హైదరాబాద్​ జట్టు 140 పరుగులకే పరిమితమవుతుంది"

ఆకాశ్ చోప్రా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

బౌలింగ్​లోనూ హైదరాబాద్​ జట్టుకు చాలా సమస్యలున్నాయని వాటిని సరిదిద్దుకోవాలని ఆకాశ్ చోప్రా చెప్పాడు. సన్​రైజర్స్ తర్వాతి మ్యాచ్​ దిల్లీ క్యాపిటల్స్​తో(సెప్టెంబరు 29న)​ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్​ ప్రారంభమవుతుంది.

ABOUT THE AUTHOR

...view details