అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ కాపిటల్స్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే, ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 17 డాట్ బాల్స్ వేసిన రషీద్ ఖాన్... టీ20ల్లో తాను ఉత్తమ బౌలర్లలో ఒకడని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 1.80 ఎకానమీ నమోదు చేసి వాహ్ అనిపించాడు.
4 ఓవర్లలో పరుగులు ఇలా..
220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ బ్యాట్స్‌మెన్‌కు రషీద్ ఖాన్ చెమటలు పట్టించాడు. నాలుగు ఓవర్లలో ఏడే పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. దీంతో 19 ఓవర్లలో 131 పరుగులే చేయగలిగింది దిల్లీ.
ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన రషీద్.. 17 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన వారిలో రబాడ(23), మహమ్మద్ షమి(20) తర్వాతి స్థానంలో ఉన్నాడు.