ఈ ఏడాది ఐపీఎల్లో వరుసగా రెండు విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది రాజస్థాన్ రాయల్స్. ఈ సారి జట్టులో సంజూ శాంసన్, రాహుల్ తెవాతియా లాంటి యువ ఆటగాళ్లు దూకుడైన ప్రదర్శనతో రెచ్చిపోతున్నారు. మరోవైపు జోఫ్రా ఆర్చర్ బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆశ్చర్యపరుస్తున్నాడు. బ్యాటింగ్ లైనప్‌లో రాజస్థాన్ బలంగా కనిపిస్తోంది. అయితే, ఈ సీజన్లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ లేకపోవడం అభిమానులకు కాస్త నిరాశ కలిగిస్తోంది. యూఏఈ స్టేడియాల్లో స్టోక్స్‌కు చాలా మ్యాచులు ఆడిన అనుభవం ఉంటడమే ఇందుకు కారణం.
ఈసారి ఐపీఎల్‌కు స్టోక్స్ ఎందుకు దూరమయ్యాడు?
ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమైన స్టార్ క్రికెటర్లలో ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఒకడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడే ఈ ఆటగాడు.. లీగ్‌లో ఎందుకు పాల్గొనలేకపోయాడంటే?
స్టోక్స్
గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ గెలుచుకోవడంలో స్టోక్స్ కీలకపాత్ర పోషించాడు. అదే ఏడాది యాషెస్ సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈసారి ఐపీఎల్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రిని కలిసేందుకు న్యూజిలాండ్ వెళ్లాడు. అందుకే లీగ్‌లో బాగం కాలేకపోయాడు. ఒకవేళ అన్నీ కుదిరితే అక్టోబరులో యూఏఈ చేరుకుని.. రాజస్థాన్ తరఫున స్టోక్స్ ఆడే అవకాశముంది.