తెలంగాణ

telangana

ETV Bharat / sports

డివిలియర్స్​కు బౌలింగ్.. అమ్మో వద్దే వద్దు! - ఐపీఎల్ 2020 వార్తలు

తమకు అవకాశమొచ్చినా సరే మ్యాచ్​లో, డివిలియర్స్​కు బౌలింగ్ చేయాలనుకోవట్లేదని ఆర్సీబీ ఆటగాళ్లు మోరిస్, చాహల్ చెప్పారు.

rcb bowler chahal
ఆర్సీబీ బౌలర్ చాహల్

By

Published : Oct 18, 2020, 9:54 AM IST

విధ్వంసక ఇన్నింగ్స్​లు ఆడే ఏబీ డివిలియర్స్​కు బౌలింగ్ చేయాలంటే ఎవరైనా సరే కొంచెం ఆలోచిస్తారు. ఐపీఎల్​ లాంటి టోర్నీల్లో ఇప్పటికే చాలామంది బౌలర్లతో ఓ ఆట ఆడుకున్నాడు ఏబీ. ఒకవేళ అతడికే బౌలింగ్ చేయమని తమకు చెబితే, ఏదో కారణం చెప్పి తప్పించుకుంటామని ఆర్సీబీ ఆటగాళ్లు చాహల్, మోరిస్ అన్నారు. రాజస్థాన్​తో మ్యాచ్​ అనంతరం జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు.

టీ20లో డివిలియర్స్​ బ్యాటింగ్ చేస్తుండగా 19 ఓవర్​లో బౌలింగ్ ఇస్తే ఏం చేస్తావు? అని మోరిస్​ను అడగ్గా, తాను వేయనని చాహల్​తో చెప్పాడు. ఇదే ప్రశ్న తనకు అడగ్గా, తొడ కండరాలు పట్టేశాయని కెప్టెన్​కు చెప్పి తప్పించుకుంటానని చాహల్ అన్నాడు.

రాజస్థాన్​తో శనివారం జరిగిన ఈ మ్యాచ్​లో బెంగళూరు, 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డివిలియర్స్ మెరుపు ఇన్నింగ్స్​తో(22 బంతుల్లో 55 పరుగులు) గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది ఆర్సీబీ.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details