తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బ్రావోను తప్పించి.. హెజిల్​వుడ్​ను ఆడించండి'

ఈసారి లీగ్​లో వరుసగా విఫలమవుతోన్న బ్రావోను తప్పించి, మరొకరికి అవకాశమివ్వాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. చెన్నై సూపర్​కింగ్స్​కు సూచించాడు. ఆ స్థానాన్ని హెజిల్​వుడ్​తో భర్తీ చేయాలని తెలిపాడు.

By

Published : Oct 17, 2020, 6:00 PM IST

We haven't seen Champion bowling from Dwayne Bravo this year: Aakash Chopra
ఆల్​రౌండర్ బ్రావో

చెన్నై సూపర్​కింగ్స్ ఆల్​రౌండర్​ డ్వేన్ బ్రావోపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్​లో ఇప్పటివరకు అతడి నుంచి ఛాంపియన్ బౌలింగ్​ను చూడలేదని అన్నాడు. అందువల్ల బ్రావో స్థానాన్ని హెజిల్​వుడ్​తో భర్తీ చేయాలని సూచించాడు. షార్జా వేదికగా దిల్లీతో శనివారం తలపడనుంది చెన్నై.

చెన్నై ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో

"బ్రావో స్థానంలో హెజిల్​వుడ్​ను ఆడిస్తే బాగుంటుంది. దీంతో డెత్ ఓవర్లలో చెన్నై బౌలింగ్ మెరుగుపడే అవకాశముంది. సీజన్​లో ఇప్పటివరకు బ్రావో నుంచి ఛాంపియన్ బౌలింగ్ చూడలేదు. ప్రారంభంలోనే గాయం కావడం వల్లే ఇలా అవుతుందేమో బహుశా!" -ఆకాశ్ చోప్రా, మాజీ క్రికెటర్

గత మ్యాచ్​లో గాయపడ్డ దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. చెన్నైతో పోరులో ఆడేది కష్టమేనని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతడు లేకుండా మ్యాచ్​ గెలవడం జట్టుకు కష్టమైన విషయమేనని అన్నాడు.

దిల్లీ క్యాపిటల్స్​లోని బౌలర్లు ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా.. గాయాలు కావడం వల్లే ఈ సీజన్​ మొత్తానికి దూరమయ్యారు. ఇటీవల వికెట్ కీపర్ రిషభ్ పంత్​ కూడా తొడ కండరాలు పట్టేయడం వల్ల, అతడికి వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details