ఈ ఐపీఎల్లో విజయంతో ఆరంభించిన చెన్నై సూపర్‌కింగ్స్.. ఆ తర్వాత రాజస్థాన్, దిల్లీ జట్లపై ఓడింది. దీంతో నిరాశకు గురైన అభిమానులు.. సీజన్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా పునరాగమనం చేయాలని కోరుతున్నారు. దీని గురించి మాట్లాడిన జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్.. అది సాధ్యం కాదని చెప్పారు. అతడి కోసం ఎదురుచూడట్లేదని అన్నారు.
"రైనాను తిరిగి రప్పించే విషయం మేం ఆలోచించట్లేదు. వ్యక్తిగత కారణాల వల్ల స్వయంగా అతడే ఈ టోర్నీకి దూరమయ్యాడు. ఆతడి నిర్ణయాన్ని గౌరవించడం బాధ్యత. ఆట అంటే మంచి, చెడు ఉండటం సహజమే. త్వరలోనే మా జట్టు గాడిలో పడుతుంది. అభిమానుల ముఖాలపై మా ఆటగాళ్లు చిరునవ్వులను తెప్పిస్తారు"