వరుస విజయాలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. ఐపీఎల్ తొలి అర్ధభాగంలో తడబడి.. ఇప్పుడు భారీ విజయాలు నమోదు చేస్తోంది. తాజాగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. జట్టు సమష్టిగా ఆడటం వల్లే విజయాలు సాధిస్తున్నామని పంజాబ్ జట్టు సారథి కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. ఇటీవలే తన తండ్రిని కోల్పోయిన మన్దీప్ సింగ్ బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు మన్దీప్.
"బయో బబుల్‌లో మనకు సన్నిహితులు ఉండరు. మన్దీప్ ఆడిన విధానం చూస్తే అందరికీ ఉద్వేగం కలుగుతుంది. అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉన్నప్పుడు జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండటం ఆశ్చర్యం కలిగించదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించాం. ఇది జట్టు సమష్టి ప్రదర్శన. ఈ విజయాల్లో కోచ్‌లదే కీలక పాత్ర."
-కేఎల్ రాహుల్, పంజాబ్ సారథి