కరోనా వైరస్ ముప్పుతో బంతిపై మెరుపు కోసం ఉమ్మిని(సలైవా) రుద్దకూడదని ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే శిక్షలు ఏంటో చెప్పింది. అలవాటులో పొరపాటో.. ఉద్దేశపూర్వకంగా చేశాడో తెలియదు గానీ బంతికి లాలాజలం రాస్తూ కెమెరాకు చిక్కాడు రాబిన్ ఉతప్ప.
దుబాయ్ వేదికగా గురువారం రాత్రి.. రాజస్థాన్, కోల్‌కతా తలపడ్డాయి. టాస్ గెలిచిన స్టీవ్‌స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభ్‌మన్ గిల్ (47), నితీశ్ రాణా (22), రసెల్ (24), మోర్గాన్ (34*) రాణించడం వల్ల 6 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్థాన్ తేలిపోయింది. 42 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. స్మిత్, సంజు, తెవాతియా, ఉతప్ప, రియాన్ విఫలమయ్యారు. టామ్ కరణ్ (54*) అర్ధశతకం బాదడమే ఆ జట్టుకు ఊరట. మిగతా ఆటగాళ్లు పరుగులు చేయకపోవడం వల్ల 137/9కే పరిమితమైంది.