ఆస్ట్రేలియా పర్యటనలో చోటు దక్కపోవడంపై తాను అసంతృప్తికి గురైనట్లు టీమ్ఇండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. జట్లు ప్రకటించిన రోజు తాను చాలా బాధపడ్డాడని అన్నాడు. కానీ ఆ సమయంలో ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మతో మాట్లాడిన తర్వాత ఆ బాధ పోయిందని తెలిపాడు. హిట్‌మ్యాన్ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని వెల్లడించాడు.
"ఆ రోజు జిమ్‌లో రోహిత్ నా పక్కన కూర్చున్నాడు. నేను బాధలో ఉన్నాని అతడితో చెప్పాను. 'ఐపీఎల్ ప్రారంభం నుంచి జట్టు కోసం నువ్వు నీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తున్నావు. టీమ్ఇండియాలో చోటు దక్కకపోవడంపై ఆలోచించకుండా, ఇప్పుడు కూడా అదే చేస్తావని నా నమ్మకం. సరైనా సమయంలో నీకు అవకాశం వస్తుంది. అది ఈరోజు లేదా ఇంకెప్పుడైనా రావాల్సిందే. నీపైనా నువ్వు విశ్వాసం ఉంచు' అని నాతో అన్నాడు. ఈ మాటలు నన్ను బాధ నుంచి బయటకు లాగి, ఆత్మవిశ్వశాన్ని నింపాయి"
-సూర్యకుమార్ యాదవ్, టీమ్ఇండియా క్రికెటర్
సంతృప్తినిచ్చింది
ఈ ఐపీఎల్‌తో తాను మరింత మెరుగయ్యానని సూర్యకుమార్ చెప్పాడు. మంచి ప్రదర్శన చేయడం కోసం బాగా శ్రమించానని తెలిపాడు.