తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ దూకుడుగా ఆడు.. లేదంటే అంతే! - sehwag feels kohli bat aggresively

ఎలిమినేటర్​ పోరులో ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ దూకుడుగా ఆడాలని మాజీ క్రికెటర్​ సెహ్వాగ్​ సూచించాడు. అప్పుడే జట్టుకు విజయం దక్కే అవకాశముందని తెలిపాడు.

Kohli
కోహ్లీ

By

Published : Nov 5, 2020, 1:17 PM IST

బెంగళూరు జట్టు సారథి కోహ్లీ దూకుడుగా ఆడాలని భారత మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు​. విరాట్ నెమ్మదిగా ఆడుతున్నాడని అందుకే జట్టుకు విజయ అవకాశాలు చేజారిపోతున్నాయని అభిప్రాయపడ్డాడు. ఎలిమినేటర్ జరగనున్న నేపథ్యంలోనే సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"కోహ్లీ గేర్ మార్చాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్​లో లయ అందుకోవడానికి 20-25 బంతులు తీసుకుంటున్నాడు. అది సరికాదు. అతడు ఔట్​ అవ్వగానే జట్టు కూడా కష్టాల్లోకి వెళుతోంది. దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లోను ఇలానే జరిగింది"

-సెహ్వాగ్​, భారత దిగ్గజ క్రికెటర్​

ప్లేఆఫ్స్​కు చేరకముందు వరుసగా నాలుగు మ్యాచులు ఓడిపోయింది బెంగళూరు జట్టు. నవంబరు 6న జరిగే ఎలిమినేటర్​​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​తో తలపడనుంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details