రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 200 వందల సిక్సుల మార్కును అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. దీంతో లీగ్ చరిత్రలో 500 ఫోర్లతో పాటు 200 సిక్సులు సాధించిన ఏకైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 43 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్సు ఉన్నాయి.
ఐపీఎల్ చరిత్రలో 336 సిక్సులతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు గేల్ ఎవ్వరికి అందనంత ఎత్తులో టాప్‌లో కొనసాగుతున్నాడు. డివిలియర్స్ (231), ధోనీ (216), రోహిత్ (209) తర్వాత స్థానాల్లో ఉన్నారు.