టీ20లో టెస్టు ఇన్నింగ్స్ ఆడిన కేదార్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ఇవ్వాలని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. తన పేలవమైన బ్యాటింగ్‌తో జట్టు ఓటమికి కారణమయ్యాడంటూ చెన్నై ఆటగాడు కేదార్ జాదవ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సారీ.. గిల్, రహానే వచ్చే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు మేం జాదవ్‌నే ఎంపిక చేస్తున్నామంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
జాదవ్ బ్యాటింగ్ సాగిందిలా..
వరుణ్ చక్రవర్తి వేసిన 17ఓవర్ మూడో బంతికే ధోనీ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేదార్.. టెస్టు తరహాలో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అప్పటికే జట్టుకు కావాల్సింది 39 పరుగులు.. చేతిలో ఉన్నది కేవలం 21 బంతులు. అతను ఎదుర్కొన్న తొలి మూడు బంతులు డిఫెన్స్ ఆడాడు. సరే.. ఇప్పుడే వచ్చాడు కదా.. తర్వాత బౌండరీలు బాదేస్తాడనుకున్నారంతా. కానీ.. జాదవ్ మాత్రం మ్యాచ్ మొత్తం అదే తరహాలో బ్యాటింగ్ చేశాడు. సింగిల్స్ తప్పితే భారీ షాట్లు ఆడలేదు. రసెల్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. నరైన్ వేసిన 19వ ఓవర్‌లో తొలి బంతికి జడేజా సింగిల్ తీయడం వల్ల మళ్లీ జాదవ్ స్ట్రైక్‌లోకి వచ్చాడు. తొలి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌పై ఆశలు రేకెత్తించాడు. ఆ తర్వాతి బంతి డాట్. నాలుగో బంతికి సింగిల్ తీశాడు. కీలకమైన 20వ ఓవర్‌లోనూ జాదవ్ మొదటి మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. తర్వాతి మూడు బంతుల్లో జడేజా.. 4, 6, 4 బౌండరీలు బాదినా అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. మొత్తంగా జాదవ్ 12 బంతులు ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో చెన్నై ఖాతాలో మరో ఓటమి చేరింది.
భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. మ్యాచ్‌కు ముందే 'జాదవ్ ఓ డెకరేషన్ పీస్' అని వ్యాఖ్యానించాడు. కోట్ల రూపాయలు పోసి చెన్నై జట్టు అతన్ని కొనుక్కొందని పేర్కొన్నాడు. అతను గోధుమ పిండిలో ఒక అణువులాంటివాడని అన్నాడు. అయితే, సెహ్వాగ్ మాటలకు అచ్చుగుద్దినట్లుగా జాదవ్ ఆటతీరు ఉంది. దీంతో నెటిజన్లు సైతం జాదవ్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. కీలక సమయంలో ధోనీ సైతం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడని కూడా ట్రోల్ చేశారు. ఇంతవరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని కేదార్ జాదవ్‌ను జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.