టీ20ల్లో డెత్ ఓవర్లు వేయడమే అసలైన సవాల్ అని ముంబయి పేస్‌ర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. అలాంటి సమయాల్లో తాను మాత్రం యార్కర్ బంతులు వేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. బంతి వేగాన్ని తగ్గించి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాలని సూచించాడు.
"న్యూజిలాండ్‌లో వాతావరణం.. దుబాయ్‌లో వాతావరణం మధ్య చాలా తేడా ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. దీనికి తోడు దాదాపు ఆరు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. నేరుగా ముంబయి తరఫున మ్యాచ్ ఆడాను. నా ప్రదర్శనపై నేను సంతోషంగా ఉన్నాను. ప్రత్యర్థి ముందు మేం నిర్దేశించాలనుకున్న లక్ష్యం కంటే తక్కువ పరుగులు చేశాం. బౌలింగ్ విషయానికి వస్తే ఆఖరి ఓవర్లో చెన్నైకి ఐదు పరుగులు అవసరం అయ్యాయి. పైగా క్రీజులో మంచి ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్ ఉన్నాడు. ఆ సమయంలో సరైన ఏరియాలో బంతులు వేయడం తప్ప ఇంకేం చేయలేం. ఇకపై మ్యాచ్ మొదట్నుంచి మంచి ప్రదేశాల్లో బంతులు వేస్తూ ప్రణాళికలు అమలు చేస్తాం."
- బౌల్ట్, ముంబయి ఇండియన్స్ పేసర్.