ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు తుదిదశకు చేరుకున్నాయి. ప్లేఆఫ్స్‌లో చోటు కోసం పోటీ మరింత రసవత్తరంగా మారింది. అగ్రస్థానంలో ముంబయి ఇండియన్స్ ఇప్పటికే అర్హత సాధించగా.. రెండో స్థానం కోసం బెంగళూరు, దిల్లీ మధ్య పోటీ నెలకొంది. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముఖ్యంగా రెండో స్థానంలో పాగా వేసేందుకు వీళ్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఓడినా ప్లేఆఫ్స్ అవకాశం ఉంటుంది. కానీ మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. రెండు జట్లూ వరుస ఓటములతో డీలాపడ్డాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ఉన్నాయి. అబుదాబి వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
దిల్లీ గాడినా పడేనా?
లీగ్ ప్రారంభంలో అదరగొట్టిన దిల్లీ.. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయింది. దీంతో తప్పెక్కడ జరుగుతుందో తెలుసుకునే పనిలో పడింది. గత మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఓటమిపాలైన శ్రేయస్ సేన బ్యాటింగ్ లైనప్‌పై మరింత దృష్టిపెట్టాలని భావిస్తోంది. ఓపెనర్లు కాంబో సరిగ్గా కుదరడం లేదు. ధావన్‌తో కలిసి పృథ్వీ షా, రహానె బరిలో దిగినా అనుకున్నంతగా రాణించలేకపోయారు. ధావన్ కూడా వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన తర్వాత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 0,0,6 పరుగులతో నిరాశపర్చాడు. పంత్, శ్రేయస్, స్టోయినిస్ గాడినపడాల్సిన అవసరం ఉంది.
బెంగళూరు గెలిచేనా?
బెంగళూరు పరిస్థితి దిల్లీలానే ఉంది. ప్రారంభంలో వరుస విజయాలతో జోరుచూపించిన కోహ్లీసేన.. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. కోహ్లీ, డివిలియర్స్‌పైనే ఆధారపడిందని మరోసారి నిరూపితమైంది. వీరిద్దరూ గత రెండు మ్యాచ్‌ల్లో అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఫించ్ స్థానంలో ఓపెనర్‌గా దిగిన ఫిలిప్పీ పర్వాలేదనిపిస్తున్నా.. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. మిడిలార్డర్లో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో చాహల్ మినహాయిస్తే అందరూ తేలిపోతున్నారు. మిగిలిన వారు కూడా రాణించాల్సిన అవసరం ఉంది.
టాస్ గెలిస్తే బౌలింగే?