తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలి' - gambhir criticizes kohli

బెంగళూరు జట్టు సారథి కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్​ గంభీర్​​. విరాట్​ పేలవమైన ప్రదర్శన వల్లే ఆర్సీబీ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నాడు. దీనికి అతడు వివరణ ఇవ్వాలని అన్నాడు.

Kohli
కోహ్లీ

By

Published : Nov 7, 2020, 12:37 PM IST

Updated : Nov 7, 2020, 2:30 PM IST

బెంగళూరు జట్టు సారథి కోహ్లీని విమర్శించిన మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​..​ ఆర్సీబీ వైఫల్యానికి విరాట్​ పేలవ ప్రదర్శనమే కారణమని అన్నాడు. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ప్లేఆఫ్స్​లో భాగంగా శుక్రవారం జరిగిన ఎలిమినేటర్​ మ్యాచ్​లో హైదరాబాద్​ చేతిలో ఓడిన ఆర్సీబీ.. సీజన్​ నుంచి నిష్క్రమించింది.

"లీగ్​ చరిత్రలో విజవంతమైన సారథులుగా కొనసాగుతోన్న ధోనీ, రోహిత్​ శర్మతో కోహ్లీని పోల్చకూడదు. కెప్టెన్సీ నుంచి విరాట్​ తప్పుకోవడం 100 శాతం సరియైనది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలంలో ఒక్క ట్రోఫీని జట్టుకు అందించలేకపోయాడు. కాబట్టి దీనికి జవాబుదారీతనం కావాలి. ఈ వైపల్యానికి తనే కారణమని అతడు ఒప్పుకోవాలి. పంజాబ్​ జట్టుకు రెండు సీజన్లలో రవిచంద్రన్​ అశ్విన్​ సారథిగా వ్యవహరించాడు. అప్పడు జట్టు విజయం సాధించలేకపోయింది. అనంతరం వెంటనే అతడిని ఆ పదవి నుంచి తప్పించి మరొకరికి కట్టబెట్టారు. ఇక రోహిత్(4)​, ధోనీ(3)సార్లు టైటిల్స్​ను అందుకున్నారు. అందుకే వారు కెప్టెన్లుగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు. కాబట్టి ఒక్కో వ్యక్తికి ఒక్కో విధానం ఉండకూడదని నా అభిప్రాయం"

-గంభీర్​, టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​

మరోవైపు ఈ ఐపీఎల్​లో​ కోహ్లీ.. తన స్టాండర్డ్స్​కు తగ్గట్లు ఆడలేదని భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. బెంగళూరు జట్టు వైఫల్యానికి ఇది ఓ కారణమని అన్నాడు. విరాట్-డివిలియర్స్, ప్రతి మ్యాచ్​లోనూ భారీగా పరుగులు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాల్సిందని అన్నాడు.

ఇదీ చూడండి:

Last Updated : Nov 7, 2020, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details