ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి కప్పు గెలవకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో జట్టు సారథి కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ మాజీ క్రికెటర్లు గంభీర్, సంజయ్ మంజ్రేకర్ సహా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్.. విరాట్‌కు మద్దతుగా నిలిచాడు. సారథి బాధ్యతలు నుంచి అతడిని తప్పించాలనడం సరైన పరిష్కారం కాదని అన్నాడు.
"కోహ్లీని సారథిగా తప్పించాలని ఆలోచించడం సరైన పరిష్కారం కాదు. జట్టును దృఢంగా తయారుచేయడానికి మార్పులు చేసే దిశగా ఫ్రాంచైజీ ఆలోచించడం మంచిది. ఓ జట్టుకు మంచి నాయకుడు ఉండటమనేది చాలా ముఖ్యం. కాబట్టి మేనేజ్మెంట్ కోహ్లీని పక్కనపెట్టదని నా అభిప్రాయం. ప్రతిజట్టుకు స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. కానీ ఆర్సీబీకి మాత్రం లేదు. బ్యాటింగ్ ఆర్డర్లో విరాట్, ఏబీ డివిలియర్స్ పైకి కిందకి మారుస్తూ వారి పైనే ఆధారపడుతోంది. టాప్ఆర్డర్లో పడిక్కల్ కూడా బాగా రాణిస్తున్నాడు. అయితే అతడితో పాటు మరో మంచి ఓపెనర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ జట్టుకు అవసరం. ఈ ఐదుగురు ఉంటే చాలు జట్టు మ్యాచ్‌లను అవలీలగా గెలుస్తుంది. మన భారత మీద బౌలర్లపైన నమ్మకం ఉంచి వారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ఏదేమైనప్పటికీ ఫ్రాంచైజీ మాత్రం కోహ్లీని కెప్టెన్సీ నుంచి తీయదు. కాకపోతే కొన్ని మార్పులు చేస్తుంది. జోస్ ఫిలిప్పి, ఉమేశ్ యాదవ్ లాంటి ఆటగాళ్లను వేలంపాటలో పెట్టి ఇద్దరు కొత్త ఓపెనర్లు, పేసర్లను తీసుకోవచ్చు"