ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన తెవాతియాకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ ధన్యవాదాలు చెప్పాడు. అతడు థాంక్స్ చెప్పింది సిక్సర్లు బాదినందుకు కాదు. ఐదో బంతిని సిక్స్ కొట్టకుండా వదిలేసినందుకు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన తెవాతియాకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ ధన్యవాదాలు చెప్పాడు. అతడు థాంక్స్ చెప్పింది సిక్సర్లు బాదినందుకు కాదు. ఐదో బంతిని సిక్స్ కొట్టకుండా వదిలేసినందుకు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
ఆదివారం రాత్రి పంజాబ్, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విధ్వంసమే సృష్టించారు. పోటీపడి మరీ బౌండరీలు బాదారు. ఈ మ్యాచ్‌లో అందరినీ ఆకర్షించింది మాత్రం రాహుల్ తెవాతియానే. అప్పటివరకూ కనీసం బంతిని బ్యాటుకు తాకించడానికే ఇబ్బంది పడ్డ తెవాతియా.. ఒక్కసారిగా అద్భుతమే చేశాడు. రవి బిష్ణోయ్ ఓవర్‌లో సిక్సర్ బాది గేర్ మార్చిన తెవాతియా.. కాట్రెల్ వేసిన ఓవర్‌ను చీల్చి చెండాడాడు. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో.. తన పేరిట ఉన్న ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల రికార్డులు బద్దలుకొట్టకుండా ఉన్నందుకు తెవాతియాకు యువీ ధన్యవాదాలు చెప్పాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్డ్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు.
తెవాతియా విధ్వంసం సాగిందిలా..
18 ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన కాట్రెల్ షార్ట్ డెలివరీగా వేసిన తొలి బంతిని తెవాతియా బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌లెగ్ మీదుగా సిక్సర్ బాదాడు. తర్వాత బంతిని కూడా స్క్వేర్ లెగ్ మీదుగా స్టాండ్స్‌లోకి పంపించాడు. ముచ్చటగా మూడో బంతిని లాంగాఫ్ మీదు నుంచి సిక్సర్‌గా మలిచాడు. అప్పటికే ఒత్తిడిలో పడిపోయిన కాట్రెల్ నాలుగో బంతికి ఫుల్‌టాస్ వేశాడు. ఆ బంతిని కూడా మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. అందులో ఐదో బంతి మాత్రం కాస్తలో మిస్సయింది. ఆరో బంతిని కూడా మిడ్ వికెట్ మీదుగా పంపించాడు. దీంతో ఆ ఒక్క ఓవర్‌లోనే 30 పరుగులు వచ్చాయి. ఆఖరికి రాజస్థాన్ మూడు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.