తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​పై పంజాబ్​ విజయం

దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్ 12​ పరుగులు తేడాతో విజయం సాధించింది. 127 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదారాబాద్​ నిర్ణీత 20ఓవర్లో 114కే ఆల్​ఔట్​ అయింది. పంజాబ్​ బ్యాట్స్​మెన్స్​లో పూరన్​(32)టాప్​ స్కోరర్​. మిగత వాళ్లు విఫలమయ్యారు. విజయంలో బౌలర్లు క్రిస్​ జోర్డాన్ (3)​, అర్ష్​దీప్​ సింగ్​ (3) కీలక పాత్ర పోషించారు. సన్​రైజర్స్​ ​ బౌలర్లలో సందీప్​ శర్మ, రషీద్​, హోల్డర్​ తలో రెండు వికెట్లు తీశారు.

Sunrisers hyderabad vs kings eleven punjab match
సన్​రైజర్స్​పై పంజాబ్​ విజయం

By

Published : Oct 24, 2020, 11:59 PM IST

Updated : Oct 25, 2020, 12:05 AM IST

పంజాబ్‌! లీగ్‌ రెండో అర్ధభాగంలో బాగా ఆడుతోంది. వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై 12​ పరుగులు తేడాతో గెలుపొందింది. 127 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ను 114కే కుప్పకూల్చింది. ఈ విజయంతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది పంజాబ్​.

రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన సన్​రైజర్స్​లో డేవిడ్‌ వార్నర్‌ (35; 20 బంతుల్లో 3×4, 2×6), విజయ్‌ శంకర్‌ (25; 25 బంతుల్లో 4×4) క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించారు. మిగతా వాళ్లు విఫలమయ్యారు. పంబాబ్​ బౌలర్లలో క్రిస్​ జోర్డాన్ (3)​, అర్ష్​దీప్​ సింగ్​ (3), షమీ, అశ్విన్​, రవి బిష్టోయ్​ తలో వికెట్​ తీశారు.

అంతకు ముందు బ్యాటింగ్​ చేసిన పంజాబ్‌లో నికోలస్‌ పూరన్‌ (32; 28 బంతుల్లో 2×4) టాప్​ స్కోరర్​. కేఎల్‌ రాహుల్‌ (27; 27 బంతుల్లో 2×4, 1×6), క్రిస్‌ గేల్‌ (20; 20 బంతుల్లో 2×4, 1×6) నామమాత్రంగా ఆడారు. సన్​రైజర్స్​ ​ బౌలర్లలో సందీప్​ శర్మ, రషీద్​, హోల్డర్​ తలో రెండు వికెట్లు తీశారు.

Last Updated : Oct 25, 2020, 12:05 AM IST

ABOUT THE AUTHOR

...view details