తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఛేదనలో మాదీ మేటి జట్టే: డేవిడ్ వార్నర్ - ఫాస్ట్ బౌలింగ్​పై వార్నర్

రాజస్థాన్​ రాయల్స్​ను ఓడించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ సందర్భంగా మాట్లాడిన డేవిడ్ వార్నర్.. ఛేదనలో హైదరాబాద్ టీం​ కూడా దృఢమైనదేనని తాను గతంలోనే చెప్పినట్లు గుర్తుచేశాడు.

WARNER_SRH
ఛేదనలో మాదీ మేటి జట్టే: డెవిడ్ వార్నర్

By

Published : Oct 23, 2020, 4:01 AM IST

Updated : Oct 23, 2020, 6:03 AM IST

అబుదాబి వేదికగా రాజస్థాన్​ రాయల్స్ జట్టుతో తలపడ్డ సన్​రైజర్స్ హైదరాబాద్​ అద్భుతంగా గెలిచింది. మనీష్​ పాండే, విజయ్ శంకర్​ చక్కగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ ఈ సందర్భంగా అన్నాడు.

"ఆటను ప్రారంభించిన తీరే అద్భుతం. పవర్​ ప్లే తర్వాత మరింత రాణించాం. కానీ, దిగ్గజ బౌలర్లను ఎదుర్కోవడం కష్టంగా అనిపిస్తుంది. వేగమైన బంతులను ఆడుతూ ఎక్కువ పరుగులు చేయలేం. మా జట్టులో జేసన్ బౌలింగ్​ బాగా చేశాడు. మా జట్టులోనూ మిడిలార్డర్​ దృఢంగా ఉందని ప్రజలకు చూపించాం. నేను గతంలో చెప్పినట్లు..మా జట్టు కూడా ఛేదనలో బాగానే రాణిస్తోంది".

-డేవిడ్ వార్నర్, సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్.

ఈ మ్యాచ్​ గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది సన్​రైజర్స్​ హైదరాబాద్.

ఇదీ చదవండి:హైదరాబాద్​ అద్భుత విజయం.. ఆశలు సజీవం

Last Updated : Oct 23, 2020, 6:03 AM IST

ABOUT THE AUTHOR

...view details