శనివారం పంజాబ్ చేతిలో ఓటమి మూటగట్టుకుంది హైదరాబాద్ జట్టు. ఈ పరాభవాన్ని మర్చిపోయి ముందుకు సాగుతామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. పంజాబ్ బౌలర్లు వేసిన స్పిన్ బౌలింగ్ తమను ఒత్తిడికి గురిచేసిందని చెప్పాడు.
" మా బౌలర్లు పంజాబ్ జట్టను కట్టడి చేసేందుకు అద్భుతంగా ప్రయత్నించారు. కానీ, తర్వాత ఛేదనలో పంజాబ్ బౌలర్ల స్పిన్ ధాటికి మేము ఒత్తిడికి గురయ్యాం. కొత్త బాల్‌తో పంజాబ్ జట్టు అద్భుతంగా ఆడింది. స్వింగ్ బౌలింగ్‌ను మినహాయిస్తే మేముు పరిమితిని మించి పోలేదు. మేము ముందుగానే అన్ని వికెట్లను కోల్పోకుండా జాగ్రత్త వహించాము. ఈ రోజు మా బౌలర్లు చక్కగా ఆడారు. అది నాకు చాలా సంతోషాన్ని కల్గించింది. ఈ ఆట గురించి మర్చిపోయి ముందుకు సాగుతాం"
-- డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ సారథి.
మరోవైపు.. జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నట్లు పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. ఆటగాళ్లను మానసికంగా సిద్ధం చేసేందుకు కోచ్ కుంబ్లే, జాంటీ రోడ్స్(ఫీల్డింగ్), వసీం జాఫర్(బ్యాటింగ్) ప్రయత్నిస్తూనే ఉన్నారని తెలిపాడు. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ ధాటిగా ఆడినప్పటికీ.. మధ్య ఓవర్లలో పరుగులను నియంత్రిస్తే మ్యాచ్ గెలవచ్చని అనుకున్నట్లు చెప్పాడు.
దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 12 పరుగులు తేడాతో విజయం సాధించింది. 127 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదారాబాద్ నిర్ణీత 20ఓవర్లో 114కే పరిమితమైంది. పంజాబ్ బ్యాట్స్‌మెన్స్‌లో పూరన్(32)టాప్ స్కోరర్. మిగత వాళ్లు విఫలమయ్యారు. ఏదేమైనప్పటికీ ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, రషీద్, హోల్డర్ తలో రెండు వికెట్లు తీశారు.
ఇదీ చూడండి:సన్‌రైజర్స్‌పై పంజాబ్ విజయం