తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో విజయం సన్​రైజర్స్​దే.. సీఎస్కేకు మరో ఓటమి - CSK vs SRH(02-10)IPL 2020

sun
నాలుగు ఓవర్లకు సన్​రైజర్స్ 27/1

By

Published : Oct 2, 2020, 7:03 PM IST

Updated : Oct 3, 2020, 12:02 AM IST

23:34 October 02

పాయింట్స్​ టేబుల్​ అట్టడుగున సీఎస్కే

చెన్నై సూపర్​కింగ్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ మధ్య దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్​లో 7 పరుగుల తేడాతో వార్నర్​సేన గెలుపొందింది. సన్​రైజర్స్​ బౌలర్లు.. మొదటి నుంచి సీఎస్కే బ్యాట్స్​మెన్​ను అడ్డుకోవడంలో విజయం సాధించారు. సన్​రైజర్స్​ డెత్​ ఓవర్​ స్పెషలిస్టు నటరాజన్​ రెండు ప్రధాన వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనలో దిగిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది.

టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకున్న సన్​రైజర్స్​ పాయింట్స్​ టేబుల్​లో నాలుగోస్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఆడిన నాలుుగు మ్యాచ్​ల్లో మూడు ఓడిపోవడం వల్ల రెండు పాయింట్లతో టేబుల్​ చివరిస్థానానికి చెన్నై సూపర్​కింగ్స్​ పరిమితమైంది.  

23:20 October 02

19 ఓవర్లకు చెన్నై 137/5

చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు ఓటమికి చేరువైంది. ఈ మ్యాచ్​లో విజయం సాధించాలంటే 6 బంతుల్లో  28 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ధోనీ(39), సామ్​ కరన్​(8) ఉన్నారు.  

22:59 October 02

జడేజా ఔట్

సన్​రైజర్స్​ హైదరాబాద్​ డెత్​ ఓవర్​ స్పెషలిస్టు నటరాజన్​ వేసిన బంతికి సీఎస్కే ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా(50) వెనుదిరిగాడు. 

22:52 October 02

వేగం పెంచిన చెన్నైబ్యాట్స్​మెన్

16 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ధోనీ (24), జడేజా (23) క్రీజులో ఉన్నారు.

22:40 October 02

14 ఓవర్లకు చెన్నై 71/4

బ్యాటింగ్​లో ఆది నుంచి తడబడుతున్న సీఎస్కే.. ఆచితూచి పరుగులు రాబడుతుంది. ధోనీ(16), జడేజా(16) ప్రస్తుతం క్రీజ్​లో ఉన్నారు. చెన్నై విజయం సాధించాలంటే 36 బంతుల్లో 94 పరుగులు చేయాల్సి ఉంది. 

22:33 October 02

13 ఓవర్లకు చెన్నై 61/4

చెన్నై సూపర్​కింగ్స్ బ్యాటింగ్​లో ఆది నుంచి అంతే తడబాటుగా ఆడుతోంది. సన్​రైజర్స్​ బౌలర్​ ఖలీల్​ అహ్మద్​ బౌలింగ్​లో కేవలం 3 పరుగులనే రాబట్టగలిగింది. ప్రస్తుతం క్రీజ్​లో ధోనీ(15), జడేజా (8) ఉన్నారు. సీఎస్కే గెలుపు కోసం 42 బంతుల్లో 104 రన్స్​ చేయాల్సి ఉంది. 

22:30 October 02

12 ఓవర్లకు చెన్నై 58/4

చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాటింగ్​ నిలకడగా సాగుతుంది. ధోనీ(14), జడేాజా (6) క్రీజులో ఉన్నారు. 48 బంతుల్లో చెన్నై సూపర్​కింగ్స్​ 107 పరుగులు చేయాల్సిఉంది.

22:24 October 02

11 ఓవర్లకు చెన్నై 55/4

చివరి రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన చెన్నై సూపర్​కింగ్స్​.. బ్యాటింగ్​లో నిలకడగా రాణిస్తున్నారు. సీఎస్కే కెప్టెన్​ ధోనీ (13), జడేజా (4) క్రీజ్​లో ఉన్నారు.  

22:21 October 02

10 ఓవర్లకు చెన్నై 44/4

సన్​రైజర్స్​ బౌలర్ల ధాటికి సీఎస్కే వెంటవెంటనే వికెట్లు సమర్పించుకోగా.. ప్రస్తుతం క్రీజ్​లో ఉన్న ధోనీ(4), జడేజా (2) ఆచితూచి బ్యాటింగ్​ చేస్తున్నారు.

22:17 October 02

కేదార్​ జాదవ్​ ఔట్​

ఛేదనలో బరిలో దిగిన ధోనీసేన ఆరంభం నుంచే తడబడుతుంది. సన్​రైజర్స్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు వెంటనే పెవిలియన్​ చేరగా.. అబ్దుల్​ సమద్​ బౌలింగ్​లో మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​ కేదార్​ జాదవ్​(3) వెనుదిరిగాడు.  

22:10 October 02

7 ఓవర్లలో చెన్నై 40/3

మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది చెన్నై సూపర్​కింగ్స్​. ప్రస్తుతం క్రీజ్​లో ధోనీ (2), కేదార్​ జాదవ్​ (3) ఉన్నారు.

22:07 October 02

డుప్లెసిస్​ ఔట్​

సన్​రైజర్స్​ హైదరాబాద్ బౌలర్​ ప్రియమ్​ గార్గ్​ వేసిన బౌలింగ్​లో సీఎస్కే బ్యాట్స్​మన్​ ఫాఫ్​ డు ప్లెసిస్​ (22) రెండు పరుగులు చేయబోయి రనౌట్​గా వెనుదిరిగాడు.  

21:59 October 02

అంబటి రాయుడు ఔట్​

సన్​రైజర్స్​ యార్కర్​ స్పెషలిస్టు నటరాజన్​ బౌలింగ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మన్​ అంబటి రాయుడు (8) వెనుదిరిగాడు

21:48 October 02

5 ఓవర్లకు చెన్నై 26/1

చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాటింగ్​లో దూకుడు పెంచింది. అహ్మద్​ వేసిన బౌలింగ్​లో సీఎస్కే బ్యాట్స్​మెన్​ 13 పరుగులను రాబట్టారు. అంబటి రాయుడు (8), ఫాఫ్​ డు ప్లెసిస్​ (14) క్రీజ్​లో ఉన్నారు. 

21:41 October 02

వాట్సన్ ఔట్

చెన్నై సూపర్ కింగ్స్ మొదటి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్​లో షేన్ వాట్సన్ (1) క్లీన్ బౌల్డయ్యాడు.

21:35 October 02

రెండు ఓవర్లకు చెన్నై 2/0

సన్​రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ రెండు ఓవర్లకు 4 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్ (2), వాట్సన్ (1) క్రీజులో ఉన్నారు.

21:10 October 02

సన్​రైజర్స్ 164

చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్​మెన్ మంచి ప్రదర్శన కనబర్చారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్​ ఆదిలోనే బెయిర్​స్టో (0) వికెట్ కోల్పోయింది. కాసేపు దూకుడుగా ఆడిన మనీశ్  పాండే కూడా 29 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్​లో కాస్త నెమ్మదిగా ఆడిన వార్నర్ 29 బంతుల్లో 28 పరుగులు చేసి వెనుదిరిగాడు. దురదృష్టవశాత్తు విలియమ్సన్ 9 పరుగులు చేసి రనౌట్​గా పెవిలియన్ చేరాడు. తర్వాత యువ ఆటగాళ్లు ప్రియమ్ గార్గ్, అభిషేక్ వర్మ జట్టు భారాన్ని తలకెత్తుకున్నారు. అభిషేక్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు. గార్గ్ మాత్రం (51) పరుగులతో అర్ధసెంచరీ చేసి నాటౌట్​గా నిలిచాడు. ఫలితంగా సన్​రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.  

21:05 October 02

ప్రియమ్ గార్గ్ హాఫ్ సెంచరీ

యువ ఆటగాడు ప్రియమ్ గార్గ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి జట్టుకు విలువైన పరుగులు అందించాడు. ప్రస్తుతం సన్​రైజర్స్ 19 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

20:59 October 02

ఐదో వికెట్ డౌన్

ఐదో వికెట్ కోల్పోయింది సన్​రైజర్స్. భారీ షాట్ ఆడబోయే క్రమంలో కీపర్​కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు అభిషేక్ వర్మ (31).

20:48 October 02

నిలకడగా సన్​రైజర్స్ బ్యాటింగ్

16 ఓవర్లు పూర్తయ్యే సరికి సన్​రైజర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ప్రియమ్ గార్గ్ (15), అభిషేక్ వర్మ (25) క్రీజులో ఉన్నారు.

20:37 October 02

నిలకడగా సన్​రైజర్స్ బ్యాటింగ్

14 ఓవర్లు పూర్తయ్యే సరికి సన్​రైజర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ప్రియమ్ గార్గ్ (5), అభిషేక్ వర్మ (17) క్రీజులో ఉన్నారు.

20:29 October 02

విలియమ్సన్ ఔట్

నాలుగో వికెట్ కోల్పోయింది సన్​రైజర్స్. 9 పరుగులు చేసి విలియమ్సన్ రనౌట్​గా వెనుదిరిగాడు.

20:27 October 02

వార్నర్ ఔట్

మూడో వికెట్ కోల్పోయింది సన్​రైజర్స్. భారీ షాట్​ ఆడబోయి కెప్టెన్ వార్నర్ (28) పెవిలియన్ చేరాడు. బౌండరీ లైన్ వద్ద డుప్లెసిస్ అద్భుత క్యాచ్​ పట్టాడు.

20:25 October 02

నిలకడగా సన్​రైజర్స్ బ్యాటింగ్

సన్​రైజర్స్​ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఆదిలోనే బెయిర్​ స్టో (0) వికెట్ కోల్పోయినా.. కెప్టెన్ వార్నర్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మనీశ్ పాండే దూకుడుగా ఆడి పవర్ ప్లేలో సన్​రైజర్స్ ఆధిపత్యం వహించేలా చేశాడు. అయితే ఇతడు 29 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్​లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో వార్నర్ (23), విలియమ్సన్ (8) ఆచితూచి ఆడుతున్నారు. ఫలితంగా హైదరాబాద్ మొదటి పది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది.

20:06 October 02

రెండో వికెట్ కోల్పోయిన సన్​రైజర్స్

సన్​రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. జోరుగా ఆడుతోన్న మనీశ్ పాండే (29) క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు.

19:59 October 02

ఆరు ఓవర్లకు సన్​రైజర్స్ 42/1

ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి సన్​రైజర్స్ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. వార్నర్(13), మనీష్ పాండే (27) క్రీజులో ఉన్నారు. 

19:47 October 02

నాలుగు ఓవర్లకు సన్​రైజర్స్ 27/1

నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి సన్​రైజర్స్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. వార్నర్(5), మనీష్ పాండే (20) క్రీజులో ఉన్నారు. 

19:41 October 02

రెండు ఓవర్లకు సన్​రైజర్స్ 12/1

రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి సన్​రైజర్స్ వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. వార్నర్(2), మనీష్ పాండే (9) క్రీజులో ఉన్నారు. 

19:34 October 02

మొదటి వికెట్ కోల్పోయిన సన్​రైజర్స్

తొలి ఓవర్లోనే సన్​రైజర్స్​కు ఎదురుదెబ్బ. ఖాతా తెరవకుండానే బెయిర్​స్టో.. దీపక్ చాహర్ బౌలింగ్​లో క్లీన్ బౌల్డయ్యాడు.

19:06 October 02

మార్పులు లేకుండా సన్​రైజర్స్.. మూడు మార్పులతో చెన్నై

సన్​రైజర్స్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, చెన్నై ముగ్గురికి కొత్తగా చోటిచ్చింది. రుతురాజ్ గైక్వాడ్, మురళీ విజయ్, హెజిల్​వుడ్ స్థానంలో రాయుడు, బ్రావో, శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు.

ఇరుజట్లు

సన్​రైజర్స్ హైదరాబాద్

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), బెయిర్​స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, అభిషేక్ వర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, టి. నటరాజన్

చెన్నై సూపర్ కింగ్స్

షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లెసిస్, ధోనీ (కెప్టెన్), కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, పీయూష్ చావ్లా, దీపక్ చాహర్

18:40 October 02

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్​రైజర్స్

దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-సన్​రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్​ జరుగుతోంది. ప్రతిసారి లీగ్​ ప్రారంభం నుంచే ఆధిపత్యం వహించే ఇరుజట్లు ఈసారి మాత్రం అందుకు భిన్నమైన ప్రదర్శన చేస్తున్నాయి. చెరో మూడు మ్యాచ్​లు ఆడిన రెండు జట్లు ఒక గెలుపుతో పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్​లో గెలిచి తమ స్థానాన్ని మెరుగు పర్చుకోవాలని చూస్తున్నాయి.  

ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచి సన్​రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.  
 

Last Updated : Oct 3, 2020, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details