తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాన్న చెప్పారు.. అందుకే ఐపీఎల్ ఆడుతున్నా: స్టోక్స్ - STOKES NEWS

తన తండ్రి చెప్పడం వల్లే ఐపీఎల్​ ఆడేందుకు వచ్చానని స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ తెలిపాడు. క్యాన్సర్​తో బాధపడుతున్న ఆయన్ను వదిలిరావడం చాలా బాధగా అనిపించిందని అన్నాడు.

Stokes says ailing father told him to get back to playing cricket
స్టోక్స్

By

Published : Oct 7, 2020, 1:39 PM IST

బ్రెయిన్ క్యాన్సర్​తో బాధపడుతున్న తన తండ్రి చెప్పడం వల్లే, ఆయన్ను విడిచిపెట్టి ఐపీఎల్​లో పాల్గొనేందుకు వచ్చానని ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు.

ఆగస్టులో పాకిస్థాన్​తో టెస్టు సిరీస్​ సమయంలో స్టోక్స్.. తన తండ్రి దగ్గరకు న్యూజిలాండ్​కు పయనమయ్యాడు. దాదాపు ఐదు వారాల పాటు అక్కడే ఉన్నాడు. ఐపీఎల్ కోసం ఈ మధ్యే యూఏఈ చేరుకున్నాడు.

తండ్రితో బెన్ స్టోక్స్

"అమ్మ, నాన్నను విడిచిరావాలంటే చాలా కష్టంగా అనిపించింది. మా కుటుంబానికి ఇది క్లిష్ట సమయం. అయినా ఒకరికి ఒకరు అండగా నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నాం. నా బాధ్యతల గురించి నాకంటే నాన్నే ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. నేను నిర్వర్తించాల్సిన పనిచాలా ఉందని, దానిని పూర్తి చేయమని చెప్పారు" -స్టోక్స్, ఇంగ్లాండ్ ఆల్​రౌండర్

ప్రస్తుతం యూఏఈలోని క్వారంటైన్​లో ఉన్న స్టోక్స్.. అక్టోబరు 10 నుంచి మ్యాచ్​లకు అందుబాటులో ఉంటాడని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్మిత్ చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details