క్వాలిఫైయర్స్-2లో వార్నర్‌సేన
ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ అదరగొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరును ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. డివిలియర్స్ (56) అర్ధశతకం బాదాడు. ఆ జట్టును హోల్డర్ (3/25), నటరాజన్ (2/33) దెబ్బతీశారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విలియమ్సన్ (50*) అర్ధశతకంతో సత్తాచాటాడు. క్వాలిఫయిర్-2లో ఆదివారం దిల్లీతో హైదరాబాద్ తలపడనుంది.