దుబాయ్ వేదికగా ఐపీఎల్-13 సీజన్లో 38వ మ్యాచ్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, దిల్లీ క్యాపిటల్స్ జట్ల జరుగుతోంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లో కలిపి, బ్యాటింగ్లో పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్, బౌలింగ్లో దిల్లీ ఆటగాడు రబాడా.. అగ్రస్థానాన్ని సంపాదించుకున్నారు.
బ్యాటింగ్లో..
- 9 మ్యాచుల్లో 525 పరుగులు చేసి 'ఆరెంజ్ క్యాప్'ను సొంతం చేసుకున్నాడు పంజాబ్ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్.
- పంజాబ్ జట్టుకే చెందిన మరో ఆటగాడు మయాంక్ అగర్వాల్.. 393 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
- 375 పరుగులతో చెన్నై ఆటగాడు డుప్లెసిస్ మూడోస్థానంలో ఉన్నాడు.
బౌలింగ్లో..
- 9 మ్యాచ్లలో 19 వికెట్లు తీసి దిల్లీ జట్టు ఆటగాడు రబాడా 'పర్పుల్ క్యాప్'ను సొంతం చేసుకున్నాడు.
- 15 వికెట్లను తీసిన ముంబయి పేసర్ బుుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు.
- 14 వికెట్లు తీసి మహమ్మద్ షమీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.