తెలంగాణ

telangana

ETV Bharat / sports

మర్చిపోయిన శ్రేయస్.. గుర్తుచేసిన వార్నర్ - డేవిడ్​ వార్నర్​ వార్తలు

టాస్ వేసిన తర్వాత దిల్లీ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్ ఓ విషయాన్ని మర్చిపోగా, వార్నర్ అతడికి సహాయం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. ఇంతకీ శ్రేయస్​కు వార్నర్​ ఏం చెప్పాడంటే?

Shreyas Iyer forgets team changes at the toss; SRH skipper David Warner comes to his rescue
మర్చిపోయిన శ్రేయస్.. గుర్తుచేసిన వార్నర్

By

Published : Nov 9, 2020, 5:13 PM IST

క్వాలిఫైయర్​-2 మ్యాచ్​లో ఆసక్తికర సంఘటన జరిగింది. టాస్​ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ తొలుత బ్యాటింగ్​ ఎంచుకున్నాడు. టాస్​ వేసిన తర్వాత జట్టులోని మార్పుల గురించి వ్యాఖ్యాత మార్క్​ నికోలస్ అడగ్గా.. పృథ్వీ షా, డేనియల్​ సామ్స్​లకు బదులుగా షిమ్రాన్​ హెట్​మేయర్​, ప్రవీణ్​ దూబేలను జట్టులోకి తీసుకున్నారు. అయితే ప్లేయింగ్​ ఎలెవన్​లో జరిగిన మార్పుల్లో రెండో ఆటగాడి పేరును శ్రేయస్​ మర్చిపోయాడు. ఇంతలో సన్​రైజర్స్​ కెప్టెన్​ వార్నర్​ ఆ మార్పును శ్రేయస్​కు చెప్పాడు.

అలా సహాయం చేశాడు

టాస్​ వేయడానికి ముందు ఇరు కెప్టెన్లు జట్టు సమాచారాన్ని పంచుకోవడం వల్ల ఆ విషయం వార్నర్​కు తెలిసింది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న వార్నర్​.. టాస్​ సమయంలో శ్రేయస్​కు సహాయం చేయగలిగాడు.

ఫైనల్లో దిల్లీ

ఆదివారం జరిగిన క్వాలిఫైయర్​-2​లో హైదరాబాద్​ జట్టుపై దిల్లీ విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రేయస్​ సేన ఫైనల్​కు చేరింది. ఈ మ్యాచ్​లో ఆల్​రౌండర్ ప్రదర్శన చేసిన స్టోయినిస్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details