తెలంగాణ

telangana

ETV Bharat / sports

'యువరాజ్​ కామెంట్​కు ధావన్ రిప్లై' - యువరాజ్​ సింగ్​ వార్తలు

ఐపీఎల్​ క్వాలిఫయర్​-2 మ్యాచ్​లో దిల్లీ బ్యాట్స్​మన్​ శిఖర్​ ధావన్​ ఔట్​ అవ్వడంపై మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ స్పందించాడు. 'రివ్యూ తీసుకోవడం మర్చిపోయావా?' అని యూవీ ట్విట్టర్​లో ప్రశ్నించగా.. ఔట్​ అయ్యాననే భ్రమతో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లినట్లు ధావన్​ చెప్పాడు.

Shikhar Dhawan replies after being teased by Yuvraj Singh for not using DRS review
'రివ్యూ తీసుకోవడం మర్చిపోయావా ధావన్​?'

By

Published : Nov 9, 2020, 8:15 PM IST

అబుదాబి వేదికగా జరిగిన క్వాలిఫయర్​-2 మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై 17 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్​ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో దిల్లీ బ్యాట్స్​మన్​ మార్కస్​ స్టోయినిస్​, శిఖర్​ ధావన్​ అద్భుత ఇన్నింగ్స్​ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్​ బౌలర్​ సందీప్​ వేసిన 19వ ఓవర్​లో ధావన్​ ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే తర్వాత అది నాటౌట్​గా​ తేలింది. కానీ అప్పటికే గబ్బర్ బౌండరీ దాటాడు. ఈ విషయంపై మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​.. ధావన్​ను ట్రోల్ చేయగా.. బౌండరీ లైన్​ దాటిన తర్వాత నాటౌట్​ అని తెలుసుకున్నట్లు శిఖర్​ తెలిపాడు.

హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ధావన్​ ఔట్​ కాకపోయినా మైదానాన్ని వీడాడని ట్విట్టర్​లో శిఖర్​ను యువరాజ్​ సింగ్ ఆటపట్టించాడు. దీనిపై స్పందించిన ధావన్​.."హా..హా.. బ్యాట్​కు బంతి తగిలిందనుకుని భ్రమపడ్డా. నేను బౌండరీ చేరుకున్నప్పుడు అది నాటౌట్​ అని నాకు తెలిసింది" అని రిప్లై ఇచ్చాడు గబ్బర్.

ఆరెంజ్​ క్యాప్​ రేసులో

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో 4 హాఫ్​ సెంచరీలు, 2 శతకాలు నమోదు చేసిన శిఖర్ ధావన్​ మొత్తంగా 603 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్​ క్యాప్​ జాబితాలోని అగ్రస్థానంలో కింగ్స్​ ఎలెవన్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ (670) తర్వాత రెండో స్థానంలో ధావన్​ ఉన్నాడు. ఈ క్యాప్​ను సాధించడానికి శిఖర్​ మరో 67 పరుగులు చేయాల్సిఉంది.

ABOUT THE AUTHOR

...view details