చెన్నై ఓపెనర్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ చెలరేగిపోయాడు. గత మ్యాచుల్లో అంతగా రాణించకలేకపోయిన వాట్సన్.. పంజాబ్‌తో మ్యాచ్‌లో తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. 53బంతుల్లో 83 పరుగులు(11 ఫోర్లు, 3 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ 87(53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్ తీరు గురించి వాట్సన్ ముందే చెప్పాడు. 'అసలైన చెన్నై ఆట రాబోతోంది' అంటూ అక్టోబర్ 3న ట్వీట్ చేశాడు. చెప్పినట్లుగానే చెన్నై అద్భుతంగా ఆడింది.
చెప్పి మరీ అదరగొట్టిన షేన్ వాట్సన్ - IPL NEWS
పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు ట్వీట్ చేసి మరీ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్. ఈ మ్యాచ్‌లో సీఎస్కే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చెన్నైై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్
గత రెండు మ్యాచుల్లోనూ ఆఖరి వరకూ పోరాడినా చెన్నై ఓడిపోయింది. దీంతో ఆదివారం రాత్రి పంజాబ్‌తో మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్ కసితో బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభం నుంచి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ప్రత్యర్థి నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. దీంతో చెన్నై పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తన ఖాతాలో రెండో గెలుపు నమోదు చేసుకుంది.