కోల్‌కతా యజమాని షారుక్ ఖాన్ తన జట్టు ఆడే మ్యాచులకు స్వయంగా వచ్చి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ ఉంటాడు. జట్టు సభ్యులు తమ బాస్‌ను సంతోషపెట్టేందుకు మరింత కష్టపడి మ్యాచ్‌లు గెలిపించే ప్రయత్నం చేస్తుంటారు. బుధవారం రాత్రి అబుదాబి వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్ చూసేందుకు షారుక్ వచ్చాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైపై కోల్‌కతా పది పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత షారుఖ్ స్టాండ్స్‌లో ఉండి మైదానంలో నవ్వులు పూయించాడు.
షారుక్ డైలాగ్‌కు మురిసిన రాహుల్ త్రిపాఠి - shahrukh khan dialogue about rahul tripathi
చెన్నై సూపర్‌కింగ్స్‌పై కోల్‌కతా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ త్రిపాఠిపై ప్రశంసలు కురిపించాడు కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్. స్టేడియంలోని స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను తిలకించిన షారుక్.. రాహుల్ త్రిపాఠిని ఉద్దేశిస్తూ ఓ డైలాగ్ చెప్పాడు. ప్రేక్షకులను ఈ డైలాగ్ విపరీతంగా ఆక్టటుకుంటోంది.
![షారుక్ డైలాగ్‌కు మురిసిన రాహుల్ త్రిపాఠి Shah Rukh Khan Shouts His Iconic Dialogue From Stands Rahul Tripathi Bursts Into Laughter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9098171-482-9098171-1602154206037.jpg)
కోల్‌కతా ఓపెనర్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి 80(51బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్లు)పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఆ అవార్డు అందుకునే సమయంలో స్టాండ్స్‌లో ఉన్న కోల్‌కతా యజమాని షారుక్.. త్రిపాఠిని ఉద్దేశిస్తూ 'రాహుల్ నామ్ తో సునా హోగా' డైలాగ్ గట్టిగా చెప్పాడు. తమ ఓనర్ ఆనందాన్ని చూసిన త్రిపాఠి ముసిముసిగా నవ్వుతూ అవార్డు తీసుకున్నాడు. షారుక్ హీరోగా నటించిన 'దిల్ తో పాగల్ హై' సినిమాలోనిదీ డైలాగ్. 'ఏ సినిమాలో హీరోగా రాహుల్ ఉంటే.. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది' అని కోల్‌కతా జట్టు ట్వీట్ చేసింది. 'కచ్చితంగా' అంటూ షారుక్ దాన్ని రీట్వీట్ చేశారు.