రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాతియాపై టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. శనివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో తెవాతియ స్టన్నింగ్ క్యాచ్‌కు తాను ముగ్ధుడయ్యానని అన్నాడు. ఈ మేరకు అతడిని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశాడు.
"తెవాతియా.. మైదానంలో నువ్వు ఏమైనా చేయగలవు. కరోనా వ్యాక్సిన్‌ను కనుక్కోమని నీకు ఓ అవకాశం ఇస్తే.. అది కూడా కనిపెట్టేస్తావు. ఈ సీజన్ నీకు బాగా కలిసొచ్చింది" అని సెహ్వాగ్ పొగడ్తలతో ముంచెత్తాడు.