తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంజాబ్​పై హాఫ్ సెంచరీతో రుతురాజ్ రికార్డు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అర్ధసెంచరీతో జట్టుకు విజయాన్నందించాడు. ఫలితంగా చెన్నై తరఫున వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు.

Ruturaj Gaikwad unique record
ఆ రికార్డు సాధించిన తొలి చెన్నై బ్యాట్స్​మన్​గా రుతురాజ్

By

Published : Nov 1, 2020, 8:47 PM IST

రుతురాజ్ గైక్వాడ్.. గతేడాది ఐపీఎల్​లో అంతగా పరిచయం లేని పేరు. ఈ సీజన్​లో వ్యక్తిగత కారణాల వల్ల చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా లీగ్ నుంచి తప్పుకోవడం వల్ల అందరి చూపు గైక్వాడ్​పైకి వెళ్లింది. కానీ ఈ యువ ఆటగాడు ఎలా ఆడాతాడా? అనే అనుమానం అందరిలోనూ ఉండేది. ఆదిలోనే కరోనా రావడం వల్ల ఇతడి ప్రదర్శనపై సందేహాలు తలెత్తాయి. కానీ వాటన్నంటినీ పటాపంచలు చేస్తూ చెన్నై తరఫున ఓ రికార్డు సృష్టించాడు రుతురాజ్.

ధోనీతో రుతురాజ్

తొలి చెన్నై ఆటగాడిగా

2019 సీజన్​ మొత్తం బెంచ్​కే పరిమితమైన రుతురాజ్ ఈ సీజన్​లో అందివచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసేలా కనిపించాడు. ప్రారంభంలో మూడు మ్యాచ్​ల్లో రెండుసార్లు డకౌట్​గా వెనుదిరిగి అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేశాడు. కానీ చివరి మూడు మ్యాచ్​ల్లో వరుసగా హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో 65 పరుగులతో నాటౌట్​గా నిలిచిన రుతురాజ్, తర్వాత కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే ఈరోజు (ఆదివారం) పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 62 పరుగులతో మరో అర్ధశతకం సాధించి నాటౌట్​గా నిలిచాడు. ఈ మూడు మ్యాచ్​ల్లో చెన్నై గెలవడం విశేషం. ఫలితంగా చెన్నై తరఫున వరుసగా మూడు అర్ధసెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడీ యువఆటగాడు.

రుతురాజ్

సెహ్వాగ్ సరసన

చివరి మూడు మ్యాచ్​ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన రుతురాజ్​ జట్టుకు విజయాన్నందిచడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఈ మూడు మ్యాచ్​ల్లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు. ఫలితంగా వరుసగా మూడుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​ అవార్డు సాధించిన మూడో భారత బ్యాట్స్​మన్​గా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు సెహ్వాగ్, కోహ్లీ ఈ ఘనత సాధించారు.

ABOUT THE AUTHOR

...view details