ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై బెంగళూరు జట్టు ఏడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 177పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో డివిలియర్స్(55) కీలక పాత్ర పోషించాడు.
రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం - ఐపీఎల్ 2020 వార్తలు
RCB tinkered with the batting line-up against Punjab and it backfired completely. An in-form AB de Villiers was demoted to number six while Shivam Dube was promoted up the order. However, the ploy didn't work.
19:03 October 17
18:59 October 17
18ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 143పరుగులు చేసింది బెంగళూరు జట్టు. క్రీజులో డివిలియర్స్(34) సిక్స్‌లతో అదరగొడుతున్నారు. గురుకీరత్ సింగ్(11) పరుగులు మాత్రమే చేశాడు. 12 బంతుల్లో 35పరుగులు చేయాలి.
18:51 October 17
16.2ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 124పరుగులు చేసింది ఆర్సీబీ. క్రీజులో డివిలియర్స్(14)కు గుర్కీరత్ సింగ్(6) సహకరిస్తున్నాడు. నాలుగు ఓవర్లలో 54 పరుగులు చేయాలి.
18:39 October 17
బెంగళూరు జట్టు పదిహేను ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. క్రీజులో ఏబీ డివిలియర్స్ (6), గుర్కీరత్ సింగ్(4) ఉన్నారు. 30 బంతుల్లో 64పరుగులు చేయాలి ఆర్సీబీ.
18:34 October 17
ఆర్సబీ వెంటవెంటనే రెండు వికెట్లను చేజార్చుకుంది. త్యాగీ వేసిన బౌలింగ్ కోహ్లీ(43) భారీ షాట్ ఆడబోయి రాహుల్ తివాతియా చేతికి చిక్కాడు. దీంతో 13.2 ఓవర్లకు 103 పరుగులు చేసింది బెంగళూరు జట్టు.
18:31 October 17
ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. రాహుల్ తివాతియా బౌలింగ్‌లో పడిక్కల్(35) స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పదమూడు ఓవర్లకు స్కోరు 102గా ఉంది.
18:26 October 17
బెంగళూరు జట్టు నిలకడగా ఆడుతోంది. క్రీజులో ఉన్న కోహ్లీ(35), పడిక్కల్(34) ఆచీతూచీ ఆడుతున్నారు. పన్నెండు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి పన్నెండు పరుగులు చేసింది ఆర్సీబీ.
18:18 October 17
ఆర్సీబీ 10.3ఓవర్లకు 80పరుగులు చేసింది. క్రీజులో ఉన్న కోహ్లీ(28), దేవదత్ పడిక్కల్(32) చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు.
18:13 October 17
తొమ్మిది ఓవర్లు పూర్తయ్యేసరికి బెంగళూరు జట్టు వికెట్ నష్టానికి 64పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(16), దేవదత్ పడిక్కల్(28) ఉన్నారు.
17:35 October 17
నెమ్మదిగా బెంగళూరు బ్యాటింగ్
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించింది. రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి 9 పరుగులు చేసింది. ఫించ్ (2) దేవదత్ పడిక్కల్ (5) ఆచితూచి ఆడుతున్నారు.
17:10 October 17
బెంగళూరు లక్ష్యం 178
బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సారథి స్మిత్ 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఉతప్ప 41 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన వారిలో బట్లర్ (24) పర్వాలేదనిపించాడు.
16:54 October 17
దూకుడుగా రాజస్థాన్
బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్నారు. 17 ఓవర్లు పూర్తయ్యే సరికి 139 పరుగులు చేశారు. సారథి స్మిత్ (41) దూకుడుగా ఆడుతున్నాడు. తెవాతియా 3 పరుగులతో ఉన్నాడు. బట్లర్ 24 పరుగులు చేసి ఔటయ్యాడు.
16:08 October 17
ఒకే ఓవర్లో రెండు వికెట్లు
చాహల్ వేసిన ఓవర్లో వరుసగా రెండు వికెట్లు పడ్డాయి. ధాటిగా బ్యాటింగ్ చేసే క్రమంలో రాజస్థాన్ ఓపెనర్ ఉతప్ప 41 పరుగులు చేసి ఔటయ్యాడు. అనతంరం శాంసన్ (9) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ బ్యాటింగ్ కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం ఈ జట్టు 8 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.
15:59 October 17
నిలకడగా రాజస్థాన్ బ్యాటింగ్
బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. స్టోక్స్ 15 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. ఉతప్ప (31) మంచి ప్రదర్శన చేస్తున్నాడు.
15:36 October 17
నెమ్మదిగా ఆడుతోన్న రాజస్థాన్
బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా వచ్చిన స్టోక్స్, ఉతప్ప నెమ్మదిగా ఆడుతున్నారు. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి 5 పరుగులు మాత్రమే చేశారు.
15:10 October 17
బెంగళూరు రెండు మార్పులతో బరిలో దిగగా.. పాత జట్టుతోనే ఆడుతోంది రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్
బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్, రాబిన ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, కార్తీక్ త్యాగి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఆరోన్ ఫించ్, దేవదత్ పడిక్కల్, కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, గురుకీరత్ సింగ్ మన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, షాహబాద్ అహ్మద్, ఇసురు ఉదానా, నవదీప్ సైనీ, చాహల్
14:48 October 17
రాజస్థాన్ బ్యాటింగ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో పోరుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో దుబాయ్ వేదికగా నేడు (శనివారం) తలపడనుంది. గత మ్యాచ్‌ల్లో వేరువేరుగా ఓడిన ఇరుజట్లు.. ఈరోజు ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.