రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 రన్స్ చేసింది. చివర్లో వరుస సిక్సర్లతో టామ్ కరన్ అర్థశతకం చేసినా.. ఉపయోగం లేకుండా పోయింది.
ఐపీఎల్: కోల్‌కతా హిట్.. రాజస్థాన్ డీలా
23:21 September 30
23:12 September 30
రాజస్థాన్ రాయల్స్ జట్టు 9 వికెట్ కోల్పోయింది. జయదేవ్ ఉనద్కట్ సిక్సర్ కొట్టే ప్రయత్నంలో బౌండరీలైన్ వద్ద ఉన్న నాగర్కోటి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 12 బంతుల్లో రాజస్థాన్ 69 రన్స్ చేయాల్సిఉంది.
23:02 September 30
17 ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లు కోల్పోయి 103 పరుగులు సాధించింది. క్రీజ్‌లో టామ్ కరన్(29), జయ్‌దేవ్ ఉనద్కట్(8)లు ఉన్నారు.
22:54 September 30
చక్రవర్తి బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్(6) ఔట్ అయ్యాడు. రాజస్థాన్ ఇంకా 32 బంతుల్లో 86 పరుగులు చేయాల్సి ఉంది.
22:49 September 30
నరైన్ బౌలింగ్‌లో శ్రేయస్ గోపాల్(5) కీపర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. రాజస్థాన్ ఇంకా 37 బంతుల్లో 94 పరుగులు చేయాల్సి ఉంది.
22:38 September 30
తెవాటియా(14) ఔట్ అయ్యాడు. రాజస్థాన్ ఇంకా 54 బంతుల్లో 108 పరుగులు చేయాల్సి ఉంది.
22:19 September 30
పరాగ్(1) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. రాజస్థాన్ ఇంకా 73 బంతుల్లో 133 పరుగులు చేయాల్సి ఉంది.
22:15 September 30
రాజస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. నాగర్కోటి బౌలింగ్‌లో ఉతప్ప(2) భారీ షాట్‌కు ప్రయత్నించగా.. శివమ్ మావి క్యాచ్ పట్టాడు. క్రీజులో తెవాటియా, పరాగ్ ఉన్నారు. రాజస్థాన్ ఇంకా 77 బంతుల్లో 134 పరుగులు చేయాల్సి ఉంది.
22:08 September 30
రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. బట్లర్(21) పెవిలియన్ చేరాడు.
22:06 September 30
6 ఓవర్లకు 39/2
రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. బట్లర్(21), ఊతప్ప(1) పరుగులతో క్రీజులో ఉన్నారు.
21:47 September 30
తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్..
ఛేదనలో తొలి వికెట్ కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. స్టీవ్ స్మిత్ 3 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం బట్లర్(9), శాంసన్(5) క్రీజులో ఉన్నారు. రాయల్స్ 3 ఓవర్లకు 21 పరుగులు చేసింది.
21:21 September 30
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. శుభ్‌మన్‌గిల్(47), రస్సెల్(24), మోర్గాన్(34), నితీశ్ రానా(22) స్కోరును పరుగులు పెట్టించడంలో కీలక పాత్ర పోషించారు. కోల్‌కతా బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అంకిత్ రాజ్‌పుత్, ఉనద్కత్, టామ్ కరన్, తెవాటియా తలొ వికెట్ పడగొట్టారు.
21:09 September 30
కోల్‌కతా ఆరో వికెట్ కోల్పోయింది. టామ్ కరన్ బౌలింగ్‌లో కమ్మిన్స్(12) భారీ షాట్‌కు ప్రయత్నించగా.. శాంసన్ క్యాచ్ పట్టాడు. 18 ఓవర్ల సమయానికి కోల్‌కతా 149/6
20:43 September 30
రస్సెల్(24) ఔట్ అయ్యాడు. 14.2 ఓవర్ల సమయానికి కోల్‌కతా స్కోరు 115/5. క్రీజులో కమ్మిన్స్, మోర్గాన్ ఉన్నారు.
20:25 September 30
జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్(47) పెవిలియన్ చేరాడు. 11.1 ఓవర్ల సమయానికి కోల్‌కతా స్కోరు 89/3. క్రీజులో దినేశ్ కార్తీక్, రస్సెల్ ఉన్నారు.
20:16 September 30
కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో రానా(22) క్యాచ్ ఔట్ అయ్యాడు. పది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 82/2. ప్రస్తుత రన్‌రేట్ 8.2గా ఉంది.
19:54 September 30
కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. ఉనద్కత్ బౌలింగ్‌లో నరైన్(15) బౌల్డ్ అయ్యాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 36/1. క్రీజులో రానా, శుభ్‌మన్ ఉన్నారు.
19:34 September 30
తొలి ఓవర్ ముగిసేసరికి వికెట్లేమి నష్టపోకుండా ఒక పరుగు చేసింది కోల్‌కతా. క్రీజులో శుభ్‌మన్‌గిల్, నరైన్ ఉన్నారు.
19:06 September 30
జట్ల వివరాలు
కోల్‌కతా
శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, నితీశ్ రానా, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్, కెప్టెన్), మోర్గాన్, రస్సెల్, పాట్ కమ్మిన్స్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, కమలేశ్ నాగర్కోటి
రాజస్థాన్
బట్లర్(వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, రాహుల్ తెవాటియా, ఉతప్ప, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, టామ్ కరన్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, ఉనద్కత్
19:02 September 30
టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కెప్టెన్ స్టీవ్ స్మిత్ భావిస్తున్నాడు.
18:33 September 30
లైవ్ అప్డేట్స్: రాజస్థాన్ వర్సెస్ కోల్‌కతా
ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా వీరిద్దరూ అమీతుమీ తేల్చుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హ్యాట్రిక్ విజయం సాధించాలని రాజస్థాన్.. గెలవాలనే లక్ష్యంతో కోల్‌కతా పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి.