ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. బుధవారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో.. రాజస్థాన్ రాయల్స్‌పై 37 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులే చేసింది స్మిత్‌సేన. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌లో టామ్ కరన్ (54), జోస్ బట్లర్ (21) తప్ప మిగిలిన వారందరూ పేలవ ప్రదర్శనతో వెనుదిరిగారు. కోల్‌కతా బౌలర్లు శివమ్ మావి (2), కమ్లేష్ నాగర్కోటి (2), వరుణ్ చక్రవర్తి (2) జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (47, 34 బంతుల్లో; 5×4, 1×6), మోర్గాన్ (34*, 23 బంతుల్లో; 1×4,2×6) రాణించడం వల్ల రాజస్థాన్‌కు కోల్‌కతా 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ సునీల్ నరైన్ (15, 14 బంతుల్లో; 2×4,1×6) మరోసారి నిరాశ పరిచాడు. ఉతప్ప ఇచ్చిన జీవన దానాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఉనద్కత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు గిల్ మాత్రం మరోసారి చక్కని ప్రదర్శన కనబరిచాడు. నరైన్ ఔటైన తర్వాత నితీశ్ రాణా (22, 17 బంతుల్లో; 2×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతడితో కలిసి రెండో వికెట్‌కు 46 పరుగులు చేశాడు.