తెలంగాణ

telangana

ETV Bharat / sports

'స్టోక్స్, శాంసన్ బ్యాటింగ్​ను చూస్తూ ఉండిపోయా' - స్టీవ్​ స్మిత్ వ్యాఖ్యలు

బెన్​ స్టోక్స్, సంజూ శాంసన్​ మెరుపు ఇన్నింగ్స్​ అందించి జట్టును గెలిపించడంపై హర్షం వ్యక్తం చేశాడు రాజస్థాన్​ కెప్టెన్​ స్టీవ్​ స్మిత్. అబుదాబి వేదికగా ముంబయితో తలపడ్డ రాజస్థాన్​ రాయల్స్.. భారీ లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలిచింది.

Smith_Stokes
స్టోక్స్, శాంసన్​లను ప్రశంసించిన స్మిత్

By

Published : Oct 26, 2020, 7:28 AM IST

అబుదాబి వేదికగా ముంబయితో తలపడ్డ రాజస్థాన్​ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేదనలో బెన్​ స్టోక్స్, సంజూ శాంసన్​ మెరుపు ఇన్నింగ్స్ అందించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఇద్దరు బ్యాట్స్​మెన్​లపై ప్రశంసల వర్షం కురిపించాడు రాజస్థాన్​ కెప్టెన్ స్టీవ్​ స్మిత్. ఇరువురు కలిసి 152 పరుగులు జోడించడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్​లో స్టోక్స్ ​107 పరుగులు చేయగా, సంజూ శాంసన్ 54 పరుగులతో ఆకట్టుకున్నాడు.

"స్టోక్స్​-శాంసన్​ కలిసి 152 పరుగులు చేసిన తీరు అద్భుతం. వారి ఆటతీరును అలా చూస్తూ ఉండిపోయా. ఇలాంటి ఆటకోసమే ఇన్నాళ్లుగా వేచి చూస్తున్నా. అనుభవాన్ని ఉపయోగించి మ్యాచ్​లో నిమగ్నమవ్వాలి. స్టోక్స్, శాంసన్​ అదే చేశారు. భారీ షాట్లతో అలరించారు."

-స్టీవ్ స్మిత్, రాజస్థాన్​ జట్టు సారథి

ఇదే జోరు కొనసాగాలి

మొదట్లో బాగా ఆడినా చివర్లో 40-45 పరుగులు ముంబయి జట్టుకు అధికంగా ఇచ్చామని స్మిత్​ అన్నాడు. కానీ, ఛేదనలో రాజస్థాన్​ బ్యాట్స్​మెన్ నమ్మకంతో ఆడారని.. ఇదే తీరు తర్వాత మ్యాచ్​ల్లోనూ కొనసాగాలని అన్నాడు.

తొలుత బ్యాటింగ్​కు దిగిన ముంబయి 195 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచింది. 21 బంతుల్లో 60 పరుగులతో హార్ధిక్​ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఛేదనలో రెచ్చిపోయిన బెన్ స్టోక్స్​ తన శతకంతో జట్టును ముందుండి గెలిపించాడు.

ఇదీ చదవండి:ముంబయిపై రాజస్థాన్​ అద్భుత విజయం

ABOUT THE AUTHOR

...view details