రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అబుదాబిలో అద్భుతం చేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 155 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది. కోహ్లీ(72*), దేవ్‌దత్(63) అర్ధ శతకాలతో మెరిశారు. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది కోహ్లీసేన.
155 పరుగుల ఛేదనలో బెంగళూరుకు ఆరంభం అదిరింది. 2.3 ఓవర్లలోనే 25 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ ఫించ్.. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. దేవ్‌దత్ పడిక్కల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్‌కు 99 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యం నెలకొల్పిన వీరిద్దరూ విజయాన్ని ఖరారు చేశారు.