అబుదాబి వేదికగా నేడు (బుధవారం) జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ పోరులో గెలిచిన వారికి ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రోహిత్ సేన అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ సేన మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఈ సారి కూడా రోహిత్ లేకుండానే!
ముంబయి ఇండియన్స్.. సారథి రోహిత్ లేకుండానే మళ్లీ బరిలో దిగనుందని సమాచారం. బ్యాటింగ్ యూనిట్ సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, ఇషాన్ కిషన్ పొలార్డ్, పాండ్యా సోదరులతో బలంగానే ఉంది. రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మంచి ఫామ్‌లోకి వచ్చాడు. డికాక్ మాత్రం విఫలమయ్యాడు. బౌలింగ్ యూనిట్లో బుమ్రా, బౌల్ట్, చాహర్, జేమ్స్ ప్యాటిన్సన్ బాగానే రాణిస్తున్నారు. కానీ గత మ్యాచ్‌లో వీరందరూ తేలిపోయారు. మొత్తంగా జట్టులోని ఆటగాళ్లంతా తమ ప్రదర్శనను కొంచెం మెరుగుపరుచుకుంటే ఈ మ్యాచ్‌లో సానుకూల ఫలితం లభించొచ్చు.
సమష్టిగా రాణిస్తే విజయం పక్కా