ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే నాలుగుసార్లు(2013,15,17,19) జట్టును విజేతగా నిలిపాడు. ఈ క్రమంలోనే పలు ఘనతలు సాధించాడు. ఇప్పుడు మరో రెండు రికార్డులకు చేరువలో ఉన్నాడు.
ఆ రికార్డులు ఏంటి?
రోహిత్ మరో 56 పరుగులు చేస్తే.. ముంబయి జట్టు తరఫున 4000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. అదే 96 పరుగులు చేస్తే, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 1000 పరుగులు పూర్తవుతాయి. దీంతో టోర్నీలోనే ఓ జట్టుపై, ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇదే సీజన్లో సెప్టెంబరు 23న ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 80 పరుగులతో అదరగొట్టాడు. ఇప్పుడూ అదే ఫామ్ కొనసాగిస్తే ఒక్క దెబ్బకు రెండు రికార్డులు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు.
కోల్‌కతాపై ముంబయిదే పైచేయి