సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌తో ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్‌శర్మ ఘనత సాధించాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనీ ఉండగా.. 193 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ రెండోస్థానాన్ని సీఎస్కే ఆల్‌రౌండర్ సురేశ్ రైనాతో కలిసి పంచుకున్నాడు. ఇటీవలే ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌తో టోర్నీలో అత్యధిక మ్యాచ్(194)లు ఆడిన ఘనతను మహీ సాధించాడు.
ఈరోజు జరుగుతోన్న మ్యాచ్‌తో కెప్టెన్‌గా 50వ మ్యాచ్‌ను ఆడుతున్న ఘనతను డేవిడ్ వార్నర్ దక్కించుకున్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌కు సీఎస్కే ఆల్‌రౌండర్ సురేశ్ రైనా దూరం అవ్వడం వల్ల టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనతను ధోనీ సాధించాడు. 13వ సీజన్ ప్రారంభానికి ముందు వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు రైనా. అనూహ్యంగా టోర్నీ నుంచి తప్పుకోవడం వల్ల ఆ తర్వాతి స్థానంలో ఉన్న ధోనీ ప్రస్తుతం అగ్రస్థానానికి చేరాడు. ఒకవేళ సీఎస్కే ప్లేఆఫ్స్‌కు వెళితే ధోనీ ఈ రికార్డును కొనసాగిస్తాడు. చెన్నై లీగ్ దశలోనే ఆగిపోయి ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరితే రోహిత్ ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది.
ఇటీవలే కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 5 వేల వ్యక్తిగత పరుగుల మైలురాయిని చేరుకున్నాడు రోహిత్. ఐపీఎల్లో 5 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల క్లబ్లో సురేశ్ రైనాతో పాటు కోహ్లీ ఉన్నాడు.