టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ప్రశంసించాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. మాజీ కెప్టెన్లు ధోనీ, గంగూలీ కాంబినేషన్ హిట్‌మ్యాన్ అని అన్నాడు. వారిద్దరు వ్యూహాత్మకంగా ఎలా ఆడతారో రోహిత్ కూడా అలానే ఆడతాడని చెప్పాడు. అతడికి ప్రత్యేక శైలి ఉందని తెలిపాడు. ఐపీఎల్ ఫైనల్లో ఆఫ్ బ్రేక్ బౌలర్ జయంత్ యాదవ్‌ను తీసుకోవడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డాడు.
"ఐపీఎల్ ఫైనల్లో జయంత్ యాదవ్‌ను ఉపయోగించుకున్న విధానమే రోహిత్ ప్రతిభకు నిదర్శనం. అతడు ఎలా ఆలోచిస్తాడనేది ఇక్కడ స్పష్టమవుతోంది. బౌలర్ బుమ్రాను 17, 18వ ఓవర్లు వేయించి.. పొలార్డ్‌ను సరైన సందర్భం చూసి బరిలో దింపుతాడు. బౌలర్ల కెప్టెన్ హిట్‌మ్యాన్ అని చెప్పడానికి ఇదే చక్కని ఉదాహరణ. ధోనీ, గంగూలీ కలిస్తే రోహిత్. వీరిద్దరూ బౌలర్లపై నమ్మకం ఉంచుతారు. వారికంటూ ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నారు. రోహిత్ కూడా అలాంటివాడే"