తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీ vs రాజస్థాన్​: స్మిత్​సేన ప్రతీకారం తీర్చుకుంటుందా? - RR vs DC match preview

ఐపీఎల్​లో దుబాయ్ వేదికగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్​ రాయల్స్​, దిల్లీ క్యాపిటల్స్​ జట్లు టోర్నీలో మరోసారి తలపడనున్నాయి. రాజస్థాన్​పై పైచేయి సాధించాలని దిల్లీ ఆశిస్తుండగా.. ఈ మ్యాచ్​లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని స్మిత్​సేన ప్రణాళికలను రచిస్తోంది

Resurgent Rajasthan Royals eye revenge against Delhi Capitals in return leg IPL clash
దిల్లీ vs రాజస్థాన్​: స్మిత్​సేన ప్రతీకారం తీర్చుకుంటుందా?

By

Published : Oct 14, 2020, 5:32 AM IST

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​ రాకతో మరింత బలపడిన రాజస్థాన్ రాయల్స్​ జట్టు.. టాప్​-2లో ఉన్న దిల్లీ క్యాపిటల్స్​తో తలపడేందుకు సిద్ధమైంది. గతవారం ఇరుజట్లు తలపడగా అందులో దిల్లీ క్యాపిటల్స్​ పైచేయి సాధించింది. బుధవారం రెండోసారి దిల్లీతో జరిగే మ్యాచ్​లో ఎలాగైనా గెలిచిన ప్రతీకారం తీర్చుకోవాలని స్మిత్​సేన ప్రణాళికలు రచిస్తోంది.

ఆల్​రౌండర్లు అదరగొడతారా?

ఆదివారం ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ జట్టు విజయం సాధించింది. ఈ గెలుపుతో పాటు బెన్​ స్టోక్స్​ జట్టులో చేరడం శిబిరంలో మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. వార్నర్​సేనతో జరిగిన మ్యాచ్​లో ఓపెనర్లు బెన్​ స్టోక్స్​, బట్లర్​తో పాటు మిడిల్​ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ స్టీవెన్​ స్మిత్​, సంజు శాంసన్ పర్వాలేదనిపించారు. రియాన్​ పరాగ్​, ఆల్​రౌండర్​ తెవాతియా చివర్లో అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో మొత్తం మీద రాజస్థాన్​ బ్యాటింగ్​ లైనప్​ తీరు బాగానే ఉంది.

బౌలింగ్​లో జోఫ్రా ఆర్చర్​, ఉనద్కత్​కు మద్దతుగా ఇప్పుడు జట్టులో బెన్​స్టోక్స్​ కూడా చేరడం వల్ల లైనప్​ మరింత పటిష్టంగా మారింది. వీరితో పాటు స్పిన్నర్లు శ్రేయస్​ గోపాల్​, తెవాతియా అద్భుతంగా రాణిస్తుండటం వల్ల ఈ జట్టులో దాదాపుగా మార్పులేవీ లేకపోవచ్చు.

దిల్లీకి కలిసొస్తుందా?

ముంబయి ఇండియన్స్​తో జరిగిన గత మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్​ ఓడిపోయింది. బ్యాటింగ్​ లైనప్​లో ఓపెనర్​ శిఖర్​ ధావన్​ అద్భుతంగా రాణిస్తున్నాడు. పృథ్వీషా, అజింక్య రహానె ఫర్వాలేదనిపిస్తున్నారు. మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ శ్రేయస్​ అయ్యర్​, మార్కస్​ స్టోయినిస్​ అద్భుత ఫామ్​లో ఉన్నారు. దిల్లీకి చెందిన బౌలర్లు అమిత్​ మిశ్రా, ఇషాంత్​ శర్మ ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగారు. మరోవైపు వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ గాయం కారణంగా వారం రోజులు అందుబాటులో ఉండకపోవచ్చు.

బౌలింగ్​ లైనప్​లో కగిసో రబాడా, రవిచంద్రన్​ అశ్విన్​, మార్కస్​ స్టోయినిస్​ అద్భుత బౌలింగ్​తో వికెట్లు పడగొడుతున్నారు. రిషబ్​ పంత్​ స్థానంలో మరొకరికి స్థానం ఇవ్వడం మినహా దిల్లీ క్యాపిటల్స్​లో మార్పులేవీ జరగకపోవచ్చు.

రాజస్థాన్ రాయల్స్​, దిల్లీ క్యాపిటల్స్​కు మధ్య దుబాయ్​ వేదికగా భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7గంటల 30నిమిషాలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

స్క్వాడ్స్​:

రాజస్థాన్ రాయల్స్:బట్లర్, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్​, ఆండ్రూ టై, కార్తిక్ త్యాగి, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్​), అంకిత్ రాజ్‌పుత్, శ్రేయాస్ గోపాల్, రాహుల్ తెవాతియా, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మహిపాల్ లోమోర్, ఓషనే థామస్, రియాన్ పరాగ్, యశస్వి జైశ్వాల్​, అనుజ్ రావత్, ఆకాశ్​ సింగ్, డేవిడ్ మిల్లర్, మనన్ వోహ్రా, శశాంక్ సింగ్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్​, రాబిన్ ఉతప్ప, అనిరుద్ధ జోషి, జోఫ్రా ఆర్చర్.

దిల్లీ క్యాపిటల్స్​: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్​), రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, పృథ్వీ షా, హెట్​మెయర్​,కగిసో రబాడా, అజింక్యా రహానె, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, సందీప్ లమిచానే , మోహిత్ శర్మ, ఎన్రిచ్ నోకియా, అలెక్స్ కారే, ఆవేశ్​ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్షల్ పటేల్, మార్కస్ స్టోయినిస్, లలిత్ యాదవ్.

ABOUT THE AUTHOR

...view details