పంజాబ్‌తో మ్యాచ్‌లో దిల్లీ స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో రెండు వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన ఏకైన ఆటగాడిగా గబ్బర్ చరిత్రకెక్కాడు.
అంతేకాదు, ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ వేసిన 13వ ఓవర్లో సిక్స్‌తో ఐపీఎల్లో 5 వేల పరుగులు సాధించాడు గబ్బర్. ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా నిలిచాడు.
యాదృచ్ఛికంగా మంగళవారంతో ధావన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తయింది.
తొలుత టాస్ గెలిచిన దిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా బరిలో దిగిన ధావన్.. 61 బంతుల్లోనే 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 20 ఓవర్లకు దిల్లీ 164 పరుగులు చేసింది.
దిల్లీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని నికోలస్ పూరన్ (53), మ్యాక్స్‌వెల్ (32) సాయంతో పంజాబ్ ఛేదించింది. అయితే, సెంచరీ హీరో ధావన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇదీ చూడండి:పంజాబ్ హ్యాట్రిక్ విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం